BPCL: వ్యాపార విస్తరణ, కొత్త ఎనర్జీ కోసం బీపీసీఎల్ రూ. 1.7 లక్షల కోట్ల పెట్టుబడులు

by S Gopi |   ( Updated:2024-08-18 13:17:31.0  )
BPCL: వ్యాపార విస్తరణ, కొత్త ఎనర్జీ కోసం బీపీసీఎల్ రూ. 1.7 లక్షల కోట్ల పెట్టుబడులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ చమురు శుద్ధి, మార్కెటింగ్ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) భారీ పెట్టుబడులకు సిద్ధమవుతోంది. రాబోయే ఐదేళ్ల కాలంలో చమురు శుద్ధి, ఇంధన మార్కెటింగ్‌తో పాటు పెట్రోకెమికల్స్, గ్రీన్ ఎనర్జీ కోసం రూ. 1.7 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు బీపీసీఎల్ ఛైర్మన్ జీ కృష్ణకుమార్ తెలిపారు. సంస్థ ప్రస్తుతం దేశీయ చమురు శుద్ధి సామర్థ్యంలో 14 శాతం, ఇంధన రిటైలింగ్ నెట్‌వర్క్‌లో నాలుగింట ఒకవంతు కలిగి ఉంది. కొత్త రంగాల్లో అడుగుపెడుతున్న నేపథ్యంలో వ్యాపారాన్ని పెంచాలని సంస్థ భావిస్తోంది. 'ప్రాజెక్ట్ ఆస్పైర్ ' విధానంలో బీపీసీఎల్ భవిష్యత్తు వ్యాపారంలో మొదటి దశను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఐదేళ్లకు వ్యూహాత్మక ఫ్రేమ్‌వర్క్ రూపొందించామని ఆయన వివరించారు. తాజా పెట్టుబడుల నిర్ణయంతో సంస్థకు దీర్ఘకాలిక విలువను సృష్టించే అవకాశం కల్పిస్తుందని కృష్ణకుమార్ తెలిపారు. 2040 నాటికి తమ కార్యకలాపాల్లో నికర సున్నా కార్బన్ ఉద్గారాలను నిర్దేశించుకున్న లక్ష్యానికి మూలధన వ్యయం దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed