- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Blinkit: జెప్టో బాటలోనే బ్లింకిట్.. కేఫ్ ఆఫరింగ్స్ కోసం డెలివరీ యాప్ ప్రారంభం..!
by Maddikunta Saikiran |

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ క్విక్ కామర్స్(Quick Commerce) జెప్టో(Zepto) ఇటీవలే కేఫ్ ఆఫరింగ్స్ కోసం జెప్టో కేఫ్(Zepto Cafe) పేరుతో ఓ యాప్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. జొమాటో(Zomato) ఆధ్వర్యంలోని బ్లింకిట్(Blinkit) కూడా ఈ రంగంలోని జెప్టో కేఫ్ తో పోటీ పడేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. అందులో భాగంగా బిస్ట్రో(Bistro) పేరుతో కొత్త డెలివరీ యాప్‌ను ప్రారంభించింది. బ్లింకిట్ ఈ యాప్ ద్వారా కస్టమర్లకు స్నాక్స్(Snacks), కాఫీ(Coffee), పానీయాలు(Beverages) వంటి వాటిని కేవలం 10 నిమిషాల్లో అందజేయనుంది. మరికొన్ని రోజుల్లో వినియోగదారులకు ఈ యాప్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తామని బ్లింకిట్ ప్రకటించింది. ప్రస్తుతం యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉందని, త్వరలో iOSలో కూడా రానుందని సంస్థ వెల్లడించింది.
Next Story