రూ.28 వేలకే QLED TV.. అతి తక్కువ ధరలో రెండు స్మార్ట్‌టీవీలు

by Harish |   ( Updated:2023-09-29 18:11:31.0  )
రూ.28 వేలకే QLED TV.. అతి తక్కువ ధరలో రెండు స్మార్ట్‌టీవీలు
X

దిశ, వెబ్‌డెస్క్: Blaupunkt కంపెనీ ఇండియాలో రెండు కొత్త స్మార్ట్‌టీవీలను విడుదల చేసింది. ఇవి 43-అంగుళాల QLED TV, 55-అంగుళాల Google TV ఎంపికలలో లభిస్తాయి. ఈ రెండు కూడా ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. 43-అంగుళాల QLED TV ధర రూ.28,999, 55 అంగుళాల మోడల్ ధర రూ.34,999. కొనుగోలు సమయంలో ICICI, Kotak, Axis బ్యాంక్ కార్డ్‌లపై 10 శాతం తక్షణ తగ్గింపు కూడా ఉంది.

Blaupunkt 43-అంగుళాల QLED TV HDR10+తో QLED 4K డిస్‌ప్లేతో వస్తుంది. దీనిలో 50W స్పీకర్‌‌లను అమర్చారు. ఇది Dolby Atmos, Dolby Digital Plus, DTS TruSurround సౌండ్‌ సిస్టం‌తో వస్తుంది. ఇది Netflix, Prime Video, Disney+Hotstar, YouTubeతో సహా అనేక యాప్‌లను కలిగి ఉంటుంది. గేమ్‌లకు యాక్సెస్‌ని అనుమతించే కిడ్స్ మోడ్ కూడా ఉంది. దీనిలో బ్లూటూత్ 5.0, డ్యూయల్ బ్యాండ్ Wifi, Chromecast, ఎయిర్‌ప్లే ఉన్నాయి. పవర్డ్ రిమోట్‌తో Google అసిస్టెంట్‌ను కూడా కలిగి ఉంది.

Blaunpunkt 55-అంగుళాల Google TV HDR10+తో 4K UHD LED బెజెల్-లెస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనిలో 60W స్టీరియో బాక్స్ స్పీకర్, DTS TruSurround సౌండ్‌‌ను అందించారు. డాల్బీ డిజిటల్ ప్లస్‌కు సపోర్ట్ చేస్తుంది. MediaTek MT9062 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది.ఇది 2GB RAM, 16 GB స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఇంకా పలు 10,000+ OTT యాప్‌లు, గేమ్స్, బ్లూటూత్ 5.0, డ్యూయల్ బ్యాండ్ Wifi, మూడు HDMI పోర్ట్‌లు, రెండు USB పోర్ట్‌లు, Chromecast, Airplayలను కలిగి ఉంది. ఇది Google అసిస్టెంట్‌తో నడిచే రిమోట్‌తో వస్తుంది.

ఇవి కూడా చదవండి : ఈ స్మార్ట్‌టీవీలపై అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో అదిరిపోయే డిస్కౌంట్లు

Advertisement

Next Story