Bitcoin: ట్రంప్ ఎఫెక్ట్.. 90,000 డాలర్లకు చేరువలో బిట్‌కాయిన్..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-11-12 12:09:04.0  )
Bitcoin: ట్రంప్ ఎఫెక్ట్.. 90,000 డాలర్లకు చేరువలో బిట్‌కాయిన్..!
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా(America)లో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ(Republican Party) నేత డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఘన విజయం సాధించడంతో బిట్‌కాయిన్(Bitcoin) విలువ రోజురోజుకి పెరుగుతోంది. సోమవారం ట్రేడింగ్ లో 82,000 డాలర్లు దాటినా ఈ మేజర్ క్రిప్టో కరెన్సీ(Crypto Currency) వాల్యూ తాజాగా మంగళవారం రోజు 89 వేల డాలర్లుకు చేరుకొని ఆల్-టైమ్ రికార్డు సృష్టించింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివరి వరకు బిట్‌కాయిన్ విలువ లక్ష డాలర్లకు చేరుకునే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా నన్ను గెలిపిస్తే అమెరికాను క్రిప్టో రాజధానిగా మారుస్తానని ట్రంప్ తన ఎన్నికల ర్యాలీలో పేర్కొన్నారు. దీంతో మార్కెట్లలో ఈ కాయిన్ విలువ అమాంతం పెరిగింది. అలాగే యూఎస్ ఫెడరల్ రిజర్వ్(US Federal Reserve) వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న సంకేతాలు కూడా బిట్‌కాయిన్ వాల్యూ పెరగడానికి ఓ కారణంగా తెలుస్తోంది. నవంబర్ 5న ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఈ కాయిన్ వాల్యూ 30 శాతం పెరగడం విశేషం.

Advertisement

Next Story