Big Alert: క్రెడిట్ కార్డు వినియోగదారులకు బిగ్ అలర్ట్..రేపటి నుంచి మారనున్న కొత్త రూల్స్ ఇవే..

by Maddikunta Saikiran |
Big Alert: క్రెడిట్ కార్డు వినియోగదారులకు బిగ్ అలర్ట్..రేపటి నుంచి మారనున్న కొత్త రూల్స్ ఇవే..
X

దిశ, వెబ్‌డెస్క్:ప్రతి నెలా ఒకటో తేదీన ఎదో ఒక రూల్స్ మారడం మనం చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగా అక్టోబర్ నెలలో కూడా కొన్ని రూల్స్ మారుతున్నాయి. ఇందులో ముఖ్యంగా ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్ కార్డు(ICICI Debit and Credit Cards)ల ఛార్జీలు, పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB) సేవింగ్స్ అకౌంట్ ఛార్జీలు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల(HDFC Bank Credit Cards)పై కొత్త నిబంధనలు వర్తించనున్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం..

రేపటి నుంచి మారనున్న కొత్త రూల్స్ ఇవే..

  • ICICI బ్యాంక్ ఖాతాదారులు అక్టోబర్ 1 నుంచి డెబిట్ కార్డుతో ఒక త్రైమాసికంలో రూ.10000 కనుక ఖర్చు పెడితే,తరువాతి మూడు నెలల్లో 2 కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్టు లాంజ్ యాక్సెస్‌లు పొందవచ్చు.
  • HDFC క్రెడిట్ కార్డు కస్టమర్లు అక్టోబర్ 1 నుంచి ప్రతి క్యాలెండర్ త్రైమాసికంలో ఒక్కసారి మాత్రమే యాపిల్ ప్రొడక్టులు కోసం రివార్డ్ పాయింట్లను రిడీమ్ చేసుకోవచ్చు
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ (PNB) సేవింగ్స్ ఖాతాల సర్వీస్ ఛార్జీల్లో పలు మార్పులు చేసింది.సేవింగ్స్ అకౌంట్లలో కనీస మొత్తం మెయింటైన్ చేయడం, డిమాండ్‌ డ్రాఫ్ట్‌ల జారీ, డూప్లికేటింగ్‌ డాక్యుమెంట్స్‌, లాకర్ రెంటల్‌కు సంబంధించిన ఫీజుల్లో పలు మార్పులు చేసింది.
  • అలాగే అక్టోబర్ 1 నుంచి పన్ను రిటర్నుల్లో ఆధార్ నంబర్ మాత్రమే వాడాలి.
Advertisement

Next Story

Most Viewed