Schemes: పిల్లల ఫ్యూచర్‌ గురించి ఎక్కువగా భయపడొద్దు.. ఒకేసారి చేతికి 70 లక్షలు వచ్చే స్కీమ్ ఇది!

by Vennela |
Schemes: పిల్లల ఫ్యూచర్‌ గురించి ఎక్కువగా భయపడొద్దు.. ఒకేసారి చేతికి 70 లక్షలు వచ్చే స్కీమ్ ఇది!
X

దిశ, వెబ్‌డెస్క్:Child Scheme for Savings: పిల్లల భవిష్యత్తు గురించి చాలా మంది తల్లిదండ్రులు బెంగ పెట్టుకుంటారు. వారికి బంగారు భవిష్యత్తును అందించాలని చిన్న వయసు నుంచే కష్టపడుతుంటారు. పిల్లలకు మంచి చదువు చెప్పించడం నుంచి పెళ్లి ఆ తర్వాత ఏ లోటూ లేకుండా ఉండేవిధంగా ఆలోచిస్తుంటారు. కొన్ని స్కీముల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల పిల్లల భవిష్యత్తు(Child Scheme for Savings)ను ప్లాన్ చేసుకోవచ్చు.

ఇంట్లో ఆడపిల్లలు ఉన్న కుటుంబాలు సుకన్య సమృద్ధి యోజన స్కీము(Sukanya Samriddhi Yojana Scheme) గురించి తప్పకుండా తెలుసుకోవాలి. పదేళ్లలోపు వయస్సుకన్న ఆడపిల్లల పేరు మీద తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఇక్కడ బ్యాంకు లేదా పోస్టాఫీసులో అకౌంట్ తీసుకోవచ్చు. ఏడాదికి కనీసం రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 1.50లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. గరిష్టంగా కుటుంబంలో ఇద్దరు అమ్మాయిల వరకు అకౌంట్ తీసుకోవచ్చు. ప్రస్తుతం వార్షిక వడ్డీరేటు ఇందులో 8.20శాతంగా ఉంది. ఇతర ప్రభుత్వ పొదుపు స్కీముల కంటే ఇందులోనే వడ్డీరేటు ఎక్కువగా ఉంటుంది.

పీపీఎఫ్ (ppf)కూడా పోస్టాఫీస్ స్కీమ్. ఇందులో కూడా వయసుతో సంబంధం లేకుండా అకౌంట్ తీసుకోవచ్చు. పిల్లలకు అయితే బర్త్ సర్టిఫికేట్, తల్లిదండ్రులు కేవైసీ వంటివి ఇవ్వాల్సి ఉంటుంది .ఇక్కడ ఏడాదికి కనీసం రూ. 500 నుంచి గరిష్టంగా రూ. 1.50లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. వరుసగా 15సంవత్సరాలు కట్టాలి. పెట్టుబడి, వడ్డీ, మెచ్యూరిటీ రిటర్న్స్ పై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. ఏడాదిలో ఒకేసారి లేదా విడతల వారీగా చెల్లించవచ్చు. ప్రస్తుతం 7.10శాతం వడ్డీ రేటు అందిస్తోంది. ఇక్కడ మీరు ఐదేళ్ల పిల్లల పేరుతో అకౌంట్ తీసుకుంటే ప్రతి ఏటా రూ. 1.50లక్షల వరుక జమ చేస్తే 15ఏళ్లకు మీ చేతికి రూ. 40. 68లక్షల వరకు అందుతుంది.

బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు కాకుండా రికవరింగ్ డిపాజిట్లు(Recovering deposits) కూడా ఉంటాయి. స్థిర వడ్డీ రేటుతో చిన్న పెట్టుబడులకు ఇది ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. నచ్చిన బ్యాంకుల్లో ఆర్డీ చేసుకోవచ్చు. ఇక్కడ నెలనెలా నిర్ణీత మొత్తం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. రిస్క్ లేకుండా రిటర్న్స్ వస్తాయి.

ఇవే కాదు పిల్లల కోసం బెస్ట్ ఇన్వెస్ట్ స్కీమ్ గా గోల్డ్ ఈటీఎఫ్(Gold ETF) కూడా ఉంది. స్థిరమైన , దీర్ఘకాలిక పెట్టుబడి అని ద్రవ్యోల్బణాన్ని బంగారం సమర్థంగా ఎదుర్కొంటుందని నిపుణులు చెబుతుంటారు. ఇక్కడ డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. ఒక గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్ కొనుగోలు చేస్తే..ఒక గ్రాము స్వచ్చమైన బంగారం విలువను పొందుతారు. ఎలక్ట్రానిక్ రూపంలో భౌతిక బంగారానికి సమానమైన బంగారం విలువను పొందుతారు.

ఇక మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds) పిల్లల భవిష్యత్తుకు మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అధిగమించవచ్చు. దీర్ఘకాలం పెట్టుబడులకు మంచివి. మీ పిల్లలకు 20ఏళ్ల వయస్సు వచ్చేంత వరకు చదువులకు రూ. 50లక్షల వరకు అవసరం పడుతుందనుకుంటే మీరు 12శాతం రాబడి అంచనాతో 15ఏళ్ల పాటు నెలనెలా రూ. 10వేల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ రిస్క్ ఎక్కువగా ఉంటుంది.

Next Story