గృహ రుణాలపై వడ్డీ రేటు తగ్గించిన బీఓఎం!

by Vinod kumar |   ( Updated:2023-03-12 16:51:49.0  )
గృహ రుణాలపై వడ్డీ రేటు తగ్గించిన బీఓఎం!
X

ముంబై:ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) గృహ రుణాలపై వడ్డీ రేటును 8.6 శాతం నుంచి 8.4 శాతానికి తగ్గిస్తున్నట్టు ఆదివారం ప్రకటించింది. సవరించిన వడ్డీ రేట్లు మార్చి 13 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. తగ్గిన రేటు మొత్తం బ్యాంకింగ్ రంగంలోనే గృహ రుణాలపై అత్యల్పంగా ఉంది. అంతేకాకుండా పారామిలిటరీ బలగాలతో పాటు రక్షణ సిబ్బందికి ప్రత్యేక వడ్డీ రేటు, వేతన జీవులకు, పెన్షనర్లకు గృహ రుణాలపై ఇతర ప్రయోజనాలను అందిస్తామని బ్యాంకు వెల్లడించింది.

అదేవిధంగా పండుగ ఆఫర్ కింద బంగారు, గృహ, కారు రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులను మాఫీ చేసింది. వినియోగదారులకు ప్రయోజనాలు కల్పించే లక్ష్యంతో బ్యాంక్ రుణాలపై తక్కువ వడ్డీతో పాటు అదనపు ప్రయోజనాలు ఇస్తున్నామని బ్యాంకు వివరించింది. కాగా, గతవారంలోనే మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా తన గృహ రుణాలపై వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు తగ్గించి 8.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. ఎంఎస్ఎంఈ రుణాలకు 8.4 శాతం వడ్డీ అమలు చేస్తామని పేర్కొంది.

ఇవి కూడా చదవండి : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed