Bank of Baroda Q2 Results: రెండో త్రైమాసికంలో అంచనాలకు మించి రాణించిన బ్యాంక్ ఆఫ్ బరోడా.. లాభం రూ.5238 కోట్ల

by Maddikunta Saikiran |
Bank of Baroda Q2 Results: రెండో త్రైమాసికంలో అంచనాలకు మించి రాణించిన బ్యాంక్ ఆఫ్ బరోడా.. లాభం రూ.5238 కోట్ల
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోనే దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(Bank of Baroda) జులై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల(July-September Quarter Results)ను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25) రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో ఆ సంస్థ మార్కెట్ అంచనాలకు మించి రాణించింది. రెండో త్రైమాసికం(Q2FY25)లో సంస్థ నికర లాభం 23 శాతం వృద్ధి చెంది రూ.5238 కోట్లకు చేరినట్లు తెలిపింది. కాగా గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసిక ఫలితాల నాటికి నికర లాభం రూ. 4253 కోట్లుగా ఉందని తన రెగ్యులేటరీ ఫైలింగ్(Regulatory Filing)లో పేర్కొంది. సంస్థ కార్యకలాపాల ఆదాయం రూ. 32,033 కోట్ల నుంచి రూ. 35,445 కోట్లకు చేరినట్లు పేర్కొంది. ఇందులో వడ్డీల ద్వారా వచ్చిన ఆదాయమే రూ. 30,263 కోట్లు ఉన్నట్లు తెలిపింది. ఇక బ్యాంక్‌ స్థూల నికార ఆస్తుల(Gross Net Assets) విలువ 3.32 శాతం నుంచి 2.50 శాతానికి, మొండి బకాయిలు(Bad Debts) 0.76 శాతం నుంచి 0.60 శాతానికి తగ్గాయని వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed