Bank of Baroda: కొత్త డిపాజిట్ స్కీమ్‌ తీసుకొచ్చిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా

by Maddikunta Saikiran |
Bank of Baroda: కొత్త డిపాజిట్ స్కీమ్‌ తీసుకొచ్చిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా
X

దిశ, వెబ్‌డెస్క్:దేశంలోనే మూడో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(Bank of Baroda) కొత్త కస్టమర్ల కోసం సరికొత్త డిపాజిట్ ఆప్షన్ తీసుకొచ్చింది. బీఓబీ ఉత్సవ్ డిపాజిట్స్ స్కీమ్(BOB Utsav Deposits Scheme) పేరుతో దీనిని ప్రవేశపెట్టింది.400 రోజుల టెన్యూర్‌తో తీసుకొచ్చిన ఈ కొత్త స్కీమ్‌ డిపాజిట్స్ చేసే వారికి అధిక వడ్డీ అందించనుంది. ఈ పథకం కింద జనరల్ కస్టమర్లకు(General Customers) 7.30 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక సీనియర్ సిటిజన్లకు(Senior Citizens) అదనంగా 50 బేసిస్ పాయింట్లు అంటే 7.80 శాతం వడ్డీ అందిస్తోంది. మరోవైపు సూపర్ సీనియర్ సిటిజన్లకు(80 ఏళ్లకు పైబడి వయస్సు ఉన్న వారు) 7.90 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఉదాహరణకు ఒక సాధారణ కస్టమర్ బీఓబీ ఉత్సవ్ డిపాజిట్స్ స్కీమ్‌లో రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే 400 రోజుల తర్వాత అసలు,వడ్డీ కలుపుకొని అతనికి రూ. 5,40,079 వరకు వస్తాయి. అదే ఒక సీనియర్ సిటిజన్ రూ. 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ. 5,42,820, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.90 శాతం వడ్డీ లెక్కన రూ. 5,43,376 వరకు అందుతాయి. ఈ పథకం ద్వారా కస్టమర్లు రూ.3 కోట్ల వరకు డిపాజిట్‌ చేసుకోవచ్చు.

Next Story