List of Bank Holidays in January 2022 in Telangana

by samatah |   ( Updated:2022-12-24 08:11:07.0  )
List of Bank Holidays in January 2022 in Telangana
X

దిశ, వెబ్‌డెస్క్ : బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అర్ట్. చాలా మంది బ్యాంకు పనులను నెగ్లెట్ చేస్తుంటారు. బ్యాంకుల సెలవు దినలు తెలియక తన ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. అలాంటి వారి కోసమే ఈ సమాచారం. ఈ ఏడాది అయిపోయి, కొత్తసంవత్సరం ప్రారంభం కాబోతుంది. అందువలన మీరు కొత్త సంవత్సరంలో ఏవైనా ఆర్థిక లావాదేవీలు చేయలనుకుంటే బ్యాంకు సెలవు దినాలు తెలుసుకొని దాని ముందు రోజు చేయడమే ఉత్తమం.

ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెల బ్యాంకు సెలవుదినాల జాబితాను విడుదల చేస్తుంది. ఈక్రమంలో జనవరి నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో తెలుసుకుందాం.

జనవరి 1, న్యూ ఇయర్, ఆదివారం కనుక అన్ని చోట్ల సెలవే.

జనవరి 2, మిజోరామ్‌ లో బ్యాంకులకు సెలవు.

జనవరి 3, ఇంఫాల్‌ లో బ్యాంకులు క్లోజ్.

జనవరి 5, గురు గోబింద్ సింగ్ జయంతి కారణంగా హర్యానా, రాజస్థాన్ లో సెలవులు.

జనవరి 8, ఆదివారం అన్ని చోట్ల సెలవే.

జనవరి 14,మకర సంక్రాంతి, రెండవ శనివారం అన్ని చోట్ల సెలవే.

జనవరి 15, కనుమ, ఆదివారం అన్ని చోట్ల సెలవే.

జనవరి 22, ఆదివారం అన్ని చోట్ల సెలవే.

జనవరి 23, నేతాజీ సుబాష్ చంద్రబోస్ జయంతి కారణంగా త్రిపుర, పశ్చిమ బెంగాల్ లో బ్యాంకులు పని చేయవు.

జనవరి 25, రాష్ట్ర దినోత్సవం కారణంగా హిమాచల్ ప్రదేశ్ లో బ్యాంకులు క్లోజ్.

జనవరి 26, గణతంత్ర దినోత్సవం కారణంగా అన్ని రాష్ట్రాలకు సెలవు.

జనవరి 28, నాల్గొవ శనివారం అన్ని చోట్ల సెలవే.

జనవరి 29, ఆదివారం అన్ని చోట్ల సెలవే.

Advertisement

Next Story

Most Viewed