ఖాతాదారులకు గమనిక : ఏప్రిల్ నెలలో ఈ రోజుల్లో బ్యాంకుల్ బంద్ ?

by samatah |
ఖాతాదారులకు గమనిక : ఏప్రిల్ నెలలో ఈ రోజుల్లో బ్యాంకుల్ బంద్ ?
X

దిశ, వెబ్‌డెస్క్ : బ్యాంకు కస్టమర్లకు ముఖ్య గమనిక.చాలా మంది బ్యాంకు సెలవు దినాలు తెలియక, ముఖ్యమైన పనులను పెండింగ్ వేస్తుంటారు. అలాంటి వారికోసమే ఈ కీలక సమాచారం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రతి నెలా బ్యాంకు సెలవులజాబితాను ముందుగానే జారీ చేస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఏప్రిల్‌ నెలకు సంబంధించిన సెలవుల జాబితాను కూడా విడుదల చేసింది. కాగా, బ్యాంకులకు ఈ నెలలో ఎన్ని రోజులు సెలవులున్నాయో ఇప్పుడు చూద్దాం.

ఏప్రిల్ 1: 2022-2023 ఆర్థిక సంవత్సరం మార్చి చివరకు ముగుస్తుంది. బ్యాంకులు వార్షిక మూసివేత కారణంగా ఏటా ఏప్రిల్‌ 1వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు సెలవు.

ఏప్రిల్ 2: ఆదివారం

ఏప్రిల్ 4: మహావీర్‌ జయంతి

ఏప్రిల్ 5: బాబూ జగ్జీవన్‌ రామ్ జయంతి

ఏప్రిల్ 7: గుడ్ ఫ్రైడే

ఏప్రిల్ 8: రెండవ శనివారం

ఏప్రిల్ 9: ఆదివారం

ఏప్రిల్ 14: అంబేడ్కర్ జయంతి

ఏప్రిల్ 15: బెంగాలీ నూతన సంవత్సరం (అగర్తలా, గౌహతి, కోల్‌కతా బ్యాంకులకు సెలవు)

ఏప్రిల్ 16: ఆదివారం

ఏప్రిల్ 18: షాబ్-ఎ-క్వార్డ్ (జమ్మూ, కాశ్మీర్‌లో బ్యాంకులకు సెలవు).

ఏప్రిల్ 21: ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్‌ ఈద్‌)

ఏప్రిల్ 22: నాలుగో శనివారం

ఏప్రిల్ 23: ఆదివారం

ఏప్రిల్ 30: ఆదివారం

అయితే ఆర్‌బీఐసెలవుల జాబితాలోని బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. ఆయా ప్రాంతీయ వేడుకలు, పండుగల ప్రకారం సెలవులు ఇస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు పబ్లిక్ హాలిడేస్ మాత్రం కామన్ గా ఉంటాయి.

Advertisement

Next Story

Most Viewed