- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మార్కెట్లోకి బజాజ్ CNG బైక్.. వచ్చేది అప్పుడే..
దిశ, బిజినెస్ బ్యూరో: బజాజ్ ఆటో క్రమంగా తన CNG మోటార్‌సైకిళ్ల పోర్ట్‌ఫోలియోను అభివృద్ధి చేస్తోంది. ఈ విభాగంలో మొట్టమొదటి CNG బైక్ జూన్‌లో విడుదల అవుతుందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో అన్నారు. కొత్తగా వచ్చే బైక్ మంచి మైలేజ్ అందిస్తుందని తెలిపారు. అయితే సాధారణ పెట్రోల్ బైకులతో పోలిస్తే వీటి ధరలు మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉంది. వినియోగదారుల సౌకర్యం కోసం CNG/పెట్రోల్‌ల కోసం ప్రత్యేక ట్యాంక్‌లు అమర్చడానికి ఖర్చులు ఎక్కువగా అవుతాయని అందుకే వీటి ధరలు కొంచెం ఎక్కువగా ఉంటాయని రాజీవ్ బజాజ్ తెలిపారు.
20 ఏళ్ల క్రితం లాంచ్ అయిన పల్సర్ త్వరలో 20 లక్షల యూనిట్లను తాకనుందని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. సామాజిక అభివృద్ధి కార్యక్రమాల కోసం బజాజ్ బియాండ్ కింద 5 సంవత్సరాలలో రూ. 5,000 కోట్లను ఖర్చు చేశామని, ఇది 2 కోట్ల మంది రేపటి తరం యువతకు ప్రయోజనం చేకూరుస్తుంది. అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ ఉపాధి, వ్యవస్థాపక అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి వీలు కల్పిస్తుందని రాజీవ్ అన్నారు.