Bajaj Chetak EV: డిసెంబర్ 20న బజాజ్ చేతక్ న్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-12-08 02:41:31.0  )
Bajaj Chetak EV: డిసెంబర్ 20న బజాజ్ చేతక్ న్యూ ఎలక్ట్రిక్   స్కూటర్ లాంచ్..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశానికి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీ బజాజ్(Bajaj) తన ఈవీ వ్యాపారాన్ని మరింత విస్తరించాలని యోచిస్తోంది. విద్యుత్ ద్విచక్ర వాహన రంగంలో ఓలా(Ola), టీవీఎస్(TVS), ఏథర్(Ather) వంటి ప్రత్యర్థుల నుండి కఠినమైన పోటీ ఎదుర్కొంటున్న బజాజ్, తన విక్రయాలను పెంచుకోవడం లక్ష్యంగా లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఈ నెల(డిసెంబర్) 20న కొత్త చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్(Chetak EV)ను లాంచ్ చేయనుంది. దీని ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించకపోయినా.. రూ. 1,00,000 పైగా ఉండొచ్చని తెలుస్తోంది.

కాగా బజాజ్ 2020 జనవరి 14న తొలి చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఇండియన్ మార్కెట్లో(Indian Market) రిలీజ్ చేసింది. ఆ టైంలో ఈవీ రంగంలో స్కూటర్ అమ్మకాలు తక్కువ ఉండగా.. ఆ తర్వాత న్యూ మోడల్స్(New Models), రేట్ తగ్గింపు(Rate Reduction) కారణంగా సేల్స్ పెరిగాయి. దేశంలో అత్యధికంగా సేల్ అవుతున్న స్కూటర్లలో చేతక్ మూడో స్థానంలో ఉంది. ఇప్పటివరకు దాదాపు మూడు లక్షలకు పైగా బజాజ్ చేతక్ స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఇక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించి డీటెయిల్స్(Details) కంపెనీ త్వరలో ప్రకటించే అవకాశముంది.

Next Story

Most Viewed