- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Jio: జియో యూజర్లకు బ్యాడ్ న్యూస్.. రీఛార్జ్ ప్లాన్‌లలో మార్పులు

దిశ, వెబ్ డెస్క్: రిలయన్స్ సంస్థకు చెందిన ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో సినిమా (Jio cinema), డిస్నీ హాట్ స్టార్ (Disney Hotstar) విలీనం తర్వాత జియో హాట్‌స్టార్ (Jio Hotstar) అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇకపై జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లతో జియో సినిమా ఫ్రీ యాక్సస్ ఉండదని సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే జియో వెబ్‌సైట్‌లోని రూ.249 ప్లాన్ నుంచి రూ.3,599 వరకు ఉన్న అన్ని ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లలోని బెనిఫిట్ లిస్ట్ నుంచి జియో సినిమాను తొలగించింది.
అయితే, జియో టీవీ, జియో క్లౌడ్‌లు మాత్రం యథావిధిగా ఉచితంగా పొందవచ్చు. ఇక జియో హాట్‌స్టార్ ఫ్రీ సేవల కోసం సంస్థ పలు స్పెషల్ ఆఫర్లను అందిస్తుంది. అలాగే, జియో హాట్‌స్టార్ యాడ్ సపోర్టెడ్ ప్లాన్ నెలకు రూ.149 నుంచి అందుబాటులో ఉంది. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ నెలకు రూ.299, ఏడాదికి రూ.1,499కి అందుబాటులో ఉంది.
జియో హాట్‌స్టార్ అందించే ప్లాన్ వివరాలు:
* యూజర్లు రూ.195తో రిఛార్జ్ చేసుకుంటే.. 28 రోజుల వ్యాలిడిటీతో 15GB హై-స్పీడ్ డేటా పొందవచ్చు. ఐపీఎల్ సందర్భంగా క్రికెట్ ప్రియుల కోసం జియో ఈ స్పెషల్ ఆఫర్‌ను అందిస్తోంది.
* యూజర్లు రూ.949 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. 90 రోజుల వ్యాలిడిటీ అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMSలతో పాటు జియో హాట్ స్టార్ సేవలు ఫ్రీ గా పొందవచ్చు.