హైదరాబాద్‌లో Amazon Web Services కార్యకలాపాలు ప్రారంభం!

by Harish |   ( Updated:2022-11-22 09:50:38.0  )
హైదరాబాద్‌లో Amazon Web Services కార్యకలాపాలు ప్రారంభం!
X

హైదరాబాద్: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు చెందిన క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కంపెనీ అమెజాన్ వెబ్ సర్వీసెస్(ఏడబ్ల్యూఎస్) దేశంలో రెండవ మౌలిక సదుపాయాల ఏడబ్ల్యూఎస్‌ రీజియన్‌ సేవలను మంగళవారం ప్రారంభించింది. ఇదివరకు 2016లో తొలి ఏడబ్ల్యూఎస్‌ను ముంబయిలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లో ఆవిష్కరించిన ఏడబ్ల్యూఎస్ రీజియన్‌ సేవల కోసం భారీ పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామని కంపెనీ తెలిపింది.

వచ్చే ఎనిమిదేళ్ల కాలంలో 4.4 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 35.94 వేల కోట్లు) పెట్టుబడులను కంపెనీ ప్రకటించింది. దీనివల్ల ఏడాదికి 48 వేల పూర్తి స్థాయి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. ఇందులో ఏడబ్ల్యూఎస్ సరఫరా విభాగంతో పాటు ఇంజనీరింగ్, టెలికమ్యూనికేషన్ సహా పలు విభాగాల్లో ఉండనున్నాయి.

అంతేకాకుండా 2030 నాటికి దాదాపు రూ. 62 వేల కోట్ల మేర దేశ జీడీపీకి సహకారం అందించనున్నట్టు కంపెనీ అభిప్రాయపడింది. డిజిటల్ ఇండియాను మద్దతిచ్చే లక్ష్యంలో భాగంగా హైదరాబాద్‌లో రీజియన్ సేవలను ప్రారంభించినట్టు అమెజాన్ డేటా సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ వైస్-ప్రెసిడెంట్ ప్రసాద్ కళ్యాణరామన్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed