- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశవ్యాప్తంగా 10 శాతం పెరిగిన ఇళ్ల ధరలు
దిశ, బిజినెస్ బ్యూరో: గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా ఇళ్ల ధరలు సగటున 10 శాతం పెరిగాయని ఓ నివేదిక తెలిపింది. దేశంలోని ప్రధాన ఎనిమిది నగరాల గురించి క్రెడాయ్, కొలియర్స్, లీజెస్ ఫోరస్ సంయుక్తంగా గురువారం విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రీమియం, లగ్జరీ ఇళ్లకు విపరీతంగా పెరిగిన డిమాండ్ వల్లనే ఇళ్ల ధరలు రెండంకెల స్థాయిలో పెరిగాయని క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం డిమాండ్ ఇదే స్థాయిలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. బెంగళూరులో గతేడాది ఇదే త్రైమాసికంలో చదరపు అడుగుకు రూ. 8,748గా ఉన్న ధర అత్యధికంగా 19 శాతం పెరిగి రూ. 10,377కి చేరింది. ఢిల్లీలో 16 శాతంతో రూ. 9,575గా ఉంది. అహ్మదాదాబాద్, పూణెలలో 13 శాతం చొప్పున పెరిగి చదరపు అడుగుకు రూ. 7,176, రూ. 9,448గా ఉంది. మిగిలిన హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లోనూ గణనీయంగా ఇళ్ల ధరలు పెరిగాయని నివేదిక పేర్కొంది.