Automobile Exports: ప్రథమార్థంలో 14 శాతం పెరిగిన వాహనాల ఎగుమతులు

by S Gopi |   ( Updated:2024-10-20 13:41:06.0  )
Automobile Exports: ప్రథమార్థంలో 14 శాతం పెరిగిన వాహనాల ఎగుమతులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో భారత వాహనాల ఎగుమతులు 14 శాతం పెరిగాయని పరిశ్రమల సంఘం సియామ్ తెలిపింది. ప్రధానంగా ప్యాసింజర్ వాహనాలతో పాటు టూవీలర్ విభాగాల్లో ఎక్కువ వృద్ధి కనిపించింది. సియామ్ విడుదల చేసిన డేటా ప్రకారం.. ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య మొత్తం 25,28,248 వాహనాలు ఎగుమతి అయ్యాయి. గతేడాది ఇదే సమయంలో 22,11,457 వాహనాలు విదేశాలకు సరఫరా అయ్యాయి. లాటిన్ అమెరికాతో పాటు ఆఫికా మార్కెట్లలో డిమాండ్ తిరిగి పుంజుకోవడం వల్లనే ఎగుమతులు మళ్లీ పుంజుకున్నాయని సియామ్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర చెప్పారు. ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాలు, ఇతర ప్రాంతాల్లో కరెన్సీల విలువ తగ్గిపోవడంతో ఆయా దేశాల్లో కొనుగొళ్లు తగ్గాయి. ఆ ప్రభావం వాహనాల ఎగుమతులపై కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. విదేశీ మార్కెట్లలో ద్రవ్య సంక్షోభం కారణంగా అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఆటోమొబైల్ ఎగుమతులు 5.5 శాతం క్షీణించాయి. మొత్తం ఎగుమతుల్లో ప్యాసింజర్ విభాగంలో 12 శాతం వృద్ధి నమోదవగా, 3,76,679 వాహనాలు విదేశీ మార్కెట్లకు వెళ్లాయి. టూవీలర్ విభాగంలో 19,59,145 వాహనాలతో 16 శాతం వృద్ధి నమోదైంది.

Advertisement

Next Story

Most Viewed