- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ford: భారత్‌లోకి తిరిగి అడుగుపెట్టబోతున్న ఫోర్డ్..!
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్ భారత్‌లోకి తిరిగి అడుగుపెట్టాలని చూస్తుందని సమాచారం. అయితే ఈ విషయంపై కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికి భారత్‌లోకి రీ-ఎంట్రీ సాధ్యాసాధ్యాలు, మార్కెట్ వృద్ధి సామర్థ్యంపై ప్రణాళికలు చేస్తున్నట్లు ఒక నివేదిక పేర్కొంది. ఫోర్డ్ 2021 లో భారత్ నుంచి నిష్క్రమించింది. అంతకుముందు $2 బిలియన్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టిన కంపెనీ, గుజరాత్‌లోని తమ ప్లాంట్‌ను టాటా మోటార్స్‌కు విక్రయించింది. ఆ తరువాత చెన్నైలోని తన ప్లాంట్‌ను JSWకి విక్రయించే ఒప్పందాన్ని ఖరారు చేసుకుని భారత్ నుంచి పూర్తిగా వైదొలగాలని అనుకుంది.
అయితే పశ్చిమ దేశాల్లో అనేక మార్కెట్లు మందగమనంతో ఉండటం, ప్రపంచ దేశాల్లో చైనా, యూరప్ మార్కెట్ల కంటే భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండటం, ఇక్కడ మార్కెట్లు ఆటో పరిశ్రమకు అత్యంత సానుకూలంగా మారడంతో, ఇతర కంపెనీలు సైతం భారత్‌ను తమ ప్రాధాన్యతగా చూస్తుండటంతో ఫోర్డ్ కంపెనీ కూడా భారత్‌లోకి తిరిగి అడుగుపెట్టాలని చూస్తుంది. దీంతో కంపెనీ చెన్నైలోని తన ప్లాంట్ విక్రయించే ఒప్పందాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకుంది.
ఫోర్డ్ రీ-ఎంట్రీలో కొత్తగా ఎలక్ట్రిక్స్ వాహనాలపై ఎక్కువ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఫోర్డ్ ప్రతినిధి మాట్లాడుతూ, రీ-ఎంట్రీ ఆమోదం పొందినట్లయితే, చెన్నై ఫ్యాక్టరీలో ఉత్పత్తిని ప్రారంభించడానికి ఇంకా ఒక సంవత్సరం పట్టవచ్చు. చట్టపరమైన పనులు, ప్లాంట్ తయారీకి సంబంధించి చాలా పనులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న యంత్రాలు మళ్లీ కార్లను తయారు చేయడానికి సరిపోతాయి, అయితే వాటి పనితీరును మరోసారి పరిశీలించాల్సి ఉందని అన్నారు.