- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంట్రీ-లెవల్ విభాగంలో కొత్త ఈవీ స్కూటర్‌ను తెచ్చిన ఏథర్ ఎనర్జీ!
బెంగళూరు: ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ మరో కొత్త ఈవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటికే విక్రయిస్తున్న 450 మోడల్‌లో రెండు వేరియంట్లను కంపెనీ విక్రయిస్తోంది. ఈ క్రమంలోనే దేశీయ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఎంట్రీ-లెవల్ విభాగంలో 450ఎస్ వేరియంట్‌ను తీసుకొచ్చింది.
3 కిలోవాట్ అవర్ బ్యాటరీ సామర్థ్యంతో వచ్చిన కొత్త ఈవీ వేరియంట్ ధరను రూ. 1,29,999(ప్రభుత్వ సబ్సిడీ మినహా)గా నిర్ణయించినట్టు ఏథర్ ఎనర్జీ తెలిపింది. ఈ స్కూటర్‌ను ఒకసారి పూర్తి ఛార్జింగ్ చేయడం ద్వారా 115 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని, అలాగే అధికంగా 90 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తుందని కంపెనీ వివరించింది.
మరో ఈవీ స్కూటర్ల తయారీ దిగ్గజం ఓలా సైతం ఇప్పటికే ఎస్1, ఎస్1 ప్రో కాకుండా ఎంట్రీ-లెవల్‌లో ఎస్1 ఎయిర్ పేరుతో స్కూటర్‌ను తీసుకొచ్చింది. దానికి పోటీగానే ఏథర్ ఎనర్జీ సైతం 450ఎస్ వేరియంట్‌ను విడుదల చేసిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఇటీవల కేంద్రం ఈవీలకు ఇచ్చే సబ్సిడీలో భారీగా కోత విధించిన సంగతి తెలిసిందే. ఇది జూన్ 1 నుంచే అమల్లోకి వచ్చింది.
ఈ క్రమంలో ఈవీ స్కూటర్ల ధరలు కనీసం రూ. 30 వేల వరకు పెరగనున్నాయి. కాబట్టి ఇప్పటికే ఉన్న ఈవీ స్కూటర్లను కొనాలంటే ప్రజలు రూ. 1.5 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఈవీ తయారీదారులు ఎంట్రీ-లెవల్ విభాగంలో తక్కువ ధరకు స్కూటర్లను తీసుకొస్తున్నాయి.
Also Read..