- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐటీ షేర్ల మద్దతుతో లాభపడ్డ సూచీలు
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలను సాధించాయి. అంతకుముందు సెషన్‌లో అమ్మకాల ఒత్తిడి కారణంగా తక్కువ లాభాలకు పరిమితమైన సూచీలు గురువారం పుంజుకున్నాయి. ఉదయం నుంచే సానుకూలంగా ట్రేడింగ్ ప్రారంభమైన అనంతరం అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాల కారణంగా కొద్దిసేపు ఊగిసలాటకు లోనయ్యాయి. ఆ తర్వాత మదుపర్ల నుంచి కొనుగోళ్ల మద్దతుతో ర్యాలీ కొనసాగింది. ఈ వారంలో దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాల సీజన్ మొదలవనుండటం, వివిధ ఆర్థిక గణాంకాల వెల్లడి నేపథ్యంలో మార్కెట్లకు కలిసొచ్చాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 271.50 పాయింట్లు ఎగసి 71,657 వద్ద, నిఫ్టీ 73.85 పాయింట్ల లాభంతో 21,618 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మీడియా, బ్యాంకింగ్, మెటల్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో రిలయన్స్ షేర్ రెండున్నర శాతానికి పైగా పుంజుకుంది. హెచ్‌సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీల షేర్లు లాభపడ్డాయి. ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, ఆల్ట్రా సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్‌సర్వ్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.03 వద్ద ఉంది.