- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వోడాఫోన్ ఐడియాకు ప్రభుత్వం మద్దతునిస్తుంది: అశ్విని వైష్ణవ్
దిశ, బిజినెస్ బ్యూరో: కష్టాల్లో ఉన్నటువంటి వోడాఫోన్ ఐడియా(వీఐ)కు ప్రభుత్వం మద్దతును అందిస్తుందని కేంద్ర, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ప్రమోటర్ల నుండి మూలధనంతో సహా రూ.45,000 కోట్ల ఈక్విటీ, డెట్‌లను సమీకరించాలనే ప్రణాళికకు మద్దతు ఇవ్వడంతో పాటు ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్న వీఐని ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని ప్రముఖ మీడియాతో మంత్రి చెప్పారు.
వోడాఫోన్ ఐడియా ఇటీవల మార్చి 5న దాదాపు రూ.20,000 కోట్ల ఈక్విటీ నిధులను సేకరించే ప్రణాళికను ఆమోదించడానికి ఏప్రిల్ 2న జరిగే ఈజీఎం సమావేశంలో పాల్గొనాల్సిందిగా తన వాటాదారులకు పిలుపునిచ్చింది. దీనిలో పూర్తి అనుమతులు లభించిన తర్వాత రాబోయే త్రైమాసికంలో నిధుల సేకరణను ముగించాలని చూస్తుంది. జనవరి 30న తన ఎర్నింగ్స్ కాల్ సందర్భంగా వీఐ నిధుల సమీకరణ పూర్తయిన తరువాత 6 నుంచి 7 నెలల్లోపు 5G సేవలను అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ఇప్పటికే ఢిల్లీ, చెన్నై, పూణే, పంజాబ్‌లోని నాలుగు కీలక సర్కిల్‌లలో 5G కనీస రోల్-అవుట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.
త్వరలో ప్రభుత్వం స్పెక్ట్రమ్ వేలాన్ని నిర్వహించనుంది. దీనికి అన్ని టెలికాం కంపెనీలు పూర్తి మద్దతు అందిస్తాయని అశ్విని వైష్ణవ్ అన్నారు. 2022లో చివరగా స్పెక్ట్రమ్ వేలం జరిగింది. దీనిలో 20 ఏళ్ల కాలపరిమతితో 72,097.85 MHz స్పెక్ట్రమ్‌ను ప్రభుత్వం అందించింది. రిలయన్స్ జియో 5జీ స్పెక్ట్రమ్‌పై రూ.88,078 కోట్లు వెచ్చించగా, భారతీ ఎయిర్‌టెల్ రూ.43,084 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.18,799 కోట్లు వెచ్చించాయి.