- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశీయ వినియోగదారుల డేటా సేకరిస్తున్న చైనా స్మార్ట్ఫోన్ బ్రాండ్ రియల్మీ!
న్యూఢిల్లీ: గత కొన్నేళ్లుగా భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో చైనా కంపెనీల ఆధిపత్యం కొనసాగుతోంది. అమ్మకాల పరంగా శాంసంగ్ తర్వాత చైనాకే చెందిన ఒప్పో, వీవో, షావోమీ, వన్ప్లస్ బ్రాండ్లు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ చైనా బ్రాండ్ స్మార్ట్ఫోన్లలోని దేశీయ వినియోగదారుల డేటాను కంపెనీ సేకరిస్తోందనే ఆరోపణలు పెరిగాయి. రియల్మీ కంపెనీ ఫోన్లో ఉండే ఎన్హ్యాన్స్డ్ ఇంటిలిజెంట్ సర్వీసెస్(ఈఐఎస్) ఫీచర్ ద్వారా వినియోగదారులకు తెలియకుండా వారి సమాచారాన్ని సేకరిస్తోందని, ఆ డేటా చైనాకు వెళ్తోందని పలువురు వినియోగదారులు ఆరోపించారు. దీనిపై స్పందించిన కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. దీనికి సంబంధించి అవసరమైన విచారణను నిర్వహిస్తామని, వినియోగదారుల డేటా భద్రతకు అన్ని రకాల రక్షణ ఉందన్నారు.
రియల్మీ కంపెనీ తన ఫోన్లో ఉండే ఈఐఎస్ ఫీచర్ ఎనేబుల్లో ఉంటే అది కస్టమర్ల సమాచారం సేకరిస్తుందని అర్థం. ఇది వినియోగదారుల అనుమతి లేకుండా ఎనేబుల్లో ఉండకూడదు. ఇదే సమయంలో ఒప్పో బ్రాండ్ ఫోన్లలో కూడా ఇలాంటి ఫీచర్ ఉందని కొందరు వినియోగదారులు చెబుతున్నారు. అంతేకాకుండా రియల్టీ, ఒప్పో, వన్ప్లస్, వీవో, ఐకూ వంటి చైనా బ్రాండ్లన్నింటికీ మాతృ సంస్థ ఒకరే కావడం గమనార్హం. దీంతో చాలామంది కస్టమర్లు తమ డేటాను సైతం సేకరిస్తున్నారా అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు.