- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఐఫోన్ తయారీకి విస్ట్రాన్ గుడ్‌బై!
బెంగళూరు: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ యాపిల్ కాంట్రాక్ట్ కంపెనీ విస్ట్రాన్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. భారత్‌లో ఐఫోన్‌ల తయారీలో లాభాలను ఆర్జించడంలో సవాళ్ల కారణంగా తన అసెంబుల్ ఫ్యాక్టరీని విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. దాంతో దేశంలో తన కార్యకలాపాలను క్రమంగా తగ్గించి వచ్చే ఏడాది నాటికి దశలవారీగా తయారీ నిలిపేయాలని భావిస్తున్నట్టు పలు నివేదికలు తెలిపాయి. విస్ట్రాన్ సంస్థ కేవలం ఐఫోన్ అసెంబ్లీ ప్రొవైడర్‌గా ఉండటంతో దీర్ఘకాలంగా లాభదాయకతను సాధించడంలో కష్టాలను ఎదుర్కొంటోంది.
దీన్ని అధిగమించేందుకు వియత్నాం, మెక్సికోలో ఉన్న తన కీలక తయారీ కార్యకలాపాలపై దృష్టి సారించనున్నట్టు సమాచారం. భారత్‌లో యాపిల్ వ్యాపాదం ద్వారా లాభాలతో పాటు మార్జిన్ పొందలేకపోయిందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. విస్ట్రాన్ సంస్థ వ్యాపార విస్తరణ చేయలేక ఇబ్బందుల్లో ఉండటంతో పాటు తయారీ ప్లాంటులో ఉద్యోగులు అధిక వేతనం కొసం ఇతర సంస్థలకు మారుతున్న సమస్యను కూడా ఎదుర్కొంటోంది. ఇది కంపెనీ వ్యాపారాన్ని మరింత దెబ్బతీస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, సంస్థ పునరుద్ధరణలో భాగంగా విస్ట్రాన్ తన ఐఫోన్ తయారీని టాటా గ్రూపునకు విక్రయించే పనిలో పడింది. ఇప్పటికే ఐఫోన్ 15 మోడల్ తయారీకి టాటా ట్రయస్ల్ నిర్వహించినట్టు సమాచారం.
.Also Read..