Apple Foldable Phone: యాపిల్ నుంచి తొలి ఫోల్డబుల్ ఫోన్.. మార్కెట్లో లాంచ్ ఎప్పుడంటే..!

by Maddikunta Saikiran |
Apple Foldable Phone: యాపిల్ నుంచి తొలి ఫోల్డబుల్ ఫోన్.. మార్కెట్లో లాంచ్ ఎప్పుడంటే..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ప్రస్తుతం ఫోల్డబుల్ మొబైల్స్(Foldable Mobiles) ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే శాంసంగ్(Samsung), మోటోరోలా(Motorola), హువావే(Huawei) కంపెనీలు ఫోల్డబుల్ ఫోన్లను ప్రవేశపెట్టగా.. తాజాగా టెక్ దిగ్గజం యాపిల్(Apple) కూడా ఈ విభాగంలో ఎంట్రీకి సిద్ధమైంది. 2026లో యాపిల్ నుంచి ఫస్ట్ ఫోల్డబుల్ మొబైల్ మార్కెట్లో లాంచ్(Launch) అయ్యే అవకాశముందని, ఐఫోన్ 18(iphone 18)తో ఈ ఫోల్డబుల్ ఫోన్ తీసుకురానుందని టెక్ వర్గాలు సమాచారం. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్, మోటోరోలా రేజర్ ఫోన్లలాగా క్లామ్ షెల్ డిజైన్(Clam Shell Design)తో దీన్ని ప్రవేశపెట్టనుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మొబైల్ కంటే బిగ్ స్క్రీన్(Big Screen)తో ఈ ఫోల్డబుల్ ఫోన్ ను తీసుకురానున్నారట. ఈ మొబైల్ సుమారు 7 ఇంచెస్ డిస్ ప్లే(Display) తో వచ్చే ఛాన్స్ ఉంది. ఇదేగాక.. 20 అంగుళాల ఫోల్డబుల్ ఐప్యాడ్(ipad)తో కూడా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశముందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed