- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
EVs: ఈవీ పరికరాల తయారీలోకి కొత్త కంపెనీ

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే అనేక కంపెనీలు ఈవీ పరిశ్రమలో ప్రవేశించాయి. ముఖ్యంగా విడి భాగాల తయారీలో ఎప్పటికప్పుడు కొత్త కంపెనీలు వస్తున్నాయి. తాజాగా ఈవీ బ్యాటరీ తయారీ రంగంలోకి కొత్త కంపెనీ అడుగుపెట్టింది. సాంప్రదాయ వాహనాల విడిభాగాలను తయారు చేసే కైనెటిక్ గ్రూప్ ఈవీ విభాగంలో బ్యాటరీలను తయారు చేయనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. దీనికోసం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో రూ. 50 కోట్ల పెట్టుబడులతో కొత్త బ్యాటరీ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంటులో కంపెనీ ఏటా 60,000 యూనిట్ల రేంజ్-ఎక్స్ బ్రాండ్ బ్యాటరీలను తయారు చేయనుంది. ఈ బ్యాటరీలు టూవీలర్, త్రీవీల ఈవీ వాహనాల్లో ఉపయోగిస్తారు. లిథియన్ ఐరన్ ఫాస్ఫేట్(ఎల్ఎఫ్‌పీ), నికెల్ మాంగనీస్ కోబాల్ట్(ఎన్ఎంసీ) బ్యాటరీలను తయారు చేయనున్నట్టు కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రధానంగా త్రీవీలర్ల కోసం తయారు చేసే ప్రిస్మాటిక్ సెల్స్‌ను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించనున్నట్టు కంపెనీ వైస్-ఛైర్మన్, ఎండీ అజింక్యా ఫిరోదియా చెప్పారు. తాము బ్యాటరీ టెక్నాలజీలో భద్రత, స్థిరమైన ఉత్పత్తులను రూపొందించనున్నట్టు ఆయన తెలిపారు. ఆటోమేషన్, స్మార్ట్ టెక్నాలజీ ద్వారా విశ్వసమైన, సమర్థవంతమైన ఎనర్జీ ఉత్పత్తులను అందించనున్నట్టు పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం భారతీయ ఈవీ మార్కెట్ 28.52 శాతం వార్షిక వృద్ధితో 2029 నాటికి రూ. 1.60 లక్షల కోట్లకు చేరుకోనుంది.