- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అమెరికాలో అమూల్ పాల విక్రయాలు
దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో ప్రసిద్ధి చెందిన అమూల్ పాల విక్రయాలు కీలక మైలురాయికి చేరుకున్నాయి. ఈ పాలను అమెరికాలో విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ తన అమూల్ పాలను అమెరికాలో విక్రయించడానికి అక్కడి 108 ఏళ్ల డెయిరీ ‘మిచిగాన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్’తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో అక్కడ దేశ బ్రాండ్ కలిగిన పాలను అమెరికా ప్రజలకు అందించనున్నారు. భారత్‌కు వెలుపల అమూల్ పాలు విడుదల చేయడం ఇదే మొదటి సారి.
తాజాగా గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జయేన్ మెహతా మీడియాతో మాట్లాడుతూ, భారత్‌లో రోజుకు లక్షల లీటర్ల తాజా పాలను సరఫరా చేసే అమూల్ బ్రాండ్ ఇప్పుడు అమెరికా మార్కెట్‌లో అడుగుపెట్టడం సంతోషంగా ఉందని అన్నారు. అమూల్ కింద 18,000 పాల సహకార కమిటీలు, 36,000 మంది రైతుల నెట్‌వర్క్ ఉంది. ఇది రోజుకు 3.5 కోట్ల లీటర్లకు పైగా పాలను ప్రాసెస్ చేస్తుంది. ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం దాదాపు 21 శాతం వాటాను అందిస్తుంది. ప్రధానంగా భారత్‌లో పాల విక్రయాల్లో అమూల్ బ్రాండ్ అతిముఖ్యమైనది.