- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Amazon India: భారత క్విక్ కామర్స్ విభాగంలో అమెజాన్ ఎంట్రీ.. 2025లో ప్రారంభం
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ఈ-కామర్స్ రంగంలో పోటీతత్వం పెరిగింది. ఇప్పటికే బ్లింకిట్ 10 నిమిషాల్లో వస్తువులను డెలివరీ చేస్తామని చెబుతుండగా, ఫిప్‌కార్ట్ కూడా తన 'మినిట్స్' సేవల ద్వారా 10-15 నిమిషాల్లో కస్టమర్లకు వస్తువులను డెలివరీ చేస్తోంది. తాజాగా అమెజాన్ సంస్థ సైతం భారత్‌లో తన క్విక్ కామర్స్ విభాగంలోకి అడుగుపెట్టాలని భావిస్తోంది. 2025 మొదటి త్రైమాసికం నాటికి తన క్విక్ కామర్స్ సేవలను ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా ఉంది. దేశంలో వేగంగా పెరుగుతున్న క్విక్ కామర్స్ వ్యాపారంలో గణనీయమైన వాటాను సాధించేందుకు వీలైనంత వేగంగా నిత్యావసరాలను అందించాలని, అందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని అమెజాన్ ఆశిస్తోంది. క్విక్ కామర్స్ సేవల కోసం అమెజాన్ ఇప్పటికే ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ను నియమించినట్టు సమాచారం. ముఖ్యంగా ఫుడ్ డెలివరీ కంపెనీ ఇన్‌స్టామార్ట్ స్విగ్గీలో వాటా కొనుగోలుకు కూడా అమెజాన్ చర్చలు జరుపుతోంది. అంతర్గతంగా ఈ ప్రాజెక్ట్‌పై అమెజాన్ పనిచేస్తున్నట్టు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. కంపెనీ వర్గాల ప్రకారం, అమెజాన్ తన ప్యాంట్రీ సేవలతో పాటు కిరాణా సరుకుల డెలివరీలను ఆర్డర్ చేసిన రోజే 20-30 నిమిషాల్లో అందించనుంది.