- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
130కి పైగా నగరాల్లో అమెజాన్ ఫ్రెష్ సర్వీస్ సేవలు
దిశ, బిజినెస్ బ్యూరో: పండ్లు, కూరగాయలు, చల్లబడిన ఉత్పత్తులు, బ్యూటీ, వ్యక్తిగత సంరక్షణ, పెంపుడు జంతువుల ఉత్పత్తులు వంటి అనేక రకాల కిరాణా సామాగ్రిని విక్రయించే అమెజాన్ ఫ్రెష్ సర్వీస్ సేవలు దేశవ్యాప్తంగా 130కి పైగా నగరాల్లో విస్తరించాయని అమెజాన్ ఇండియా మంగళవారం తెలిపింది. అమెజాన్ యాప్‌లో లభిస్తున్న ఈ సేవల ద్వారా వినియోగదారులకు త్వరతగిన సరళీకృత షాపింగ్ అనుభవం లభిస్తుంది. దీనిలో ప్రత్యేకంగా వ్యక్తిగతీకరించిన విడ్జెట్‌లు, తరచుగా షాపింగ్ చేసిన వస్తువులు మరచిపోకుండా ఉండేలా రిమైండర్‌లు ఉంటాయి. అమెజాన్ ఫ్రెష్ ద్వారా కస్టమర్లు బుకింగ్ చేసిన వాటిని వేగంగా ఇంటి వద్దకే తీసుకొచ్చి అందిస్తారు. కొనుగోలు సమయంలో ప్రత్యేకమైన డిస్కౌంట్లు, తగ్గింపులు లభిస్తాయి.
అమెజాన్ ఫ్రెష్ ఇండియా డైరెక్టర్ శ్రీకాంత్ శ్రీరామ్ మాట్లాడుతూ, అమెజాన్ ఫ్రెష్ భారతదేశంలో కిరాణా షాపింగ్ అనుభవాలను మారుస్తోంది. మేము భారతదేశంలోని 130 నగరాల్లోని మా కస్టమర్ల ఇంటి వద్దకే తాజా ఉత్పత్తులు, రోజువారీ నిత్యావసర వస్తువులను అందిస్తాము. మా విస్తరణ, నాణ్యమైన ఉత్పత్తులపై దృష్టి కేంద్రీకరించడం కస్టమర్‌లకు సేవ చేయడంలో మా నిబద్ధతను ప్రదర్శిస్తుంది. అమెజాన్ ఫ్రెష్ ద్వారా పంపిన ఉత్పత్తులు 4 దశల నాణ్యత తనిఖీ తర్వాతే వినియోగదారులకు చేరుతాయి. ఇంకా, కస్టమర్‌లకు క్యాష్‌బ్యాక్, ఆఫర్‌లు, బ్యాంక్ డిస్కౌంట్ ప్రయోజనాలను అందిస్తామని ఆయన అన్నారు.