- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Jindal Steel CEO: విమానంలో జిందాల్ స్టీల్ సీఈఓ లైంగికంగా వేధించారన్న మహిళ
దిశ, బిజినెస్ బ్యూరో: జిందాల్ స్టీల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్(సీఈఓ) దినేష్ కుమార్ తనను విమానంలో లైంగికంగా వేధించారని ఒక మహిళ సోషల్‌మీడియా ఎక్స్ వేదికగా కంపెనీ చైర్మన్, ఎంపీ నవీన్ జిందాల్‌కు ఫిర్యాదు చేసింది. ఆ మహిళ పేర్కొన్న దాని ప్రకారం, కోల్‌కతా నుండి అబుదాబికి ఎతిహాద్ ఎయిర్‌వేస్ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు జిందాల్ స్టీల్ సీఈఓ దినేష్ కుమార్ తన పక్కన కూర్చున్నాడని, ఆ తర్వాత కొద్ది సేపటికి తనతో మాటలు కలిపి, అతని కుటుంబం మొదలైన వాటి గురించి సాధారణంగా మాట్లాడుతూ, ఆపై సినిమాలు చూపిస్తాననే నెపంతో అకస్మాత్తుగా పోర్న్ వీడియోలను చూపించాడని పేర్కొంది.
ఆ తరువాత అతను పట్టుకోడానికి ప్రయత్నించగా, షాక్‌తో భయపడి సీటు నుంచి వెళ్లి ఎయిర్ సిబ్బందికి ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. వెంటనే సిబ్బంది వారి సీటింగ్ ఏరియాలో కూర్చోబెట్టి టీ, పండ్లు అందించగా, ఆ తర్వాత కూడా అతను సిబ్బందిని పిలిచి, తన ఆచూకీ గురించి చెప్పాలని అడిగాడని మహిళ తెలిపింది. విమానం దిగగానే చివరికి అబుదాబి పోలీసులను సంప్రదించడంతో వారు ఆయన్ను ఈ విషయం గురించి అడిగినప్పుడు దీనిని ఖండించలేదని, ఇలాంటి సంఘటన మరోక మహిళకు జరగకుండా చూడాలంటూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. నాయకత్వ హోదాలో ఉన్న వారు ఇలాంటి వాటికి పాల్పడటం దారుణం. అతను తన మహిళా ఉద్యోగులతో ఎలా ప్రవర్తిస్తాడో అని కూడా నేను భయపడుతున్నానని పోస్ట్‌లో రాసింది.
బాధిత మహిళ పోస్ట్‌పై జిందాల్ స్టీల్ చైర్మన్ నవీన్ జిందాల్ స్పందించారు, వేధింపులకు సంబంధించి కంపెనీ కఠినమైన జీరో-టాలరెన్స్ పాలసీకి కట్టుబడి ఉందని, ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు చేస్తున్నాము, నేర రుజువైనట్లయితే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.