- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.1000 లోపు Amazon Prime, Disney+ Hotstarలను అందించే Airtel పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టెలికాం కంపెనీ Airtel తన వినియోగదారుల కోసం నార్మల్ రీఛార్జ్ ప్లాన్‌తో పాటు అదనంగా అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ OTT ప్లాట్‌ఫారమ్‌లను ఉచితంగా అందించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ధరలు దాదాపు కస్టమర్లకు అందుబాటులోనే ఉన్నాయి. రూ. 1000 లోపు ధరలో మూడు ప్లాన్‌లను ఎయిర్‌టెల్ ఆఫర్ చేస్తుంది. అవి రూ. 499, రూ. 599, రూ. 999.
రూ. 499 ప్లాన్
ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో అపరిమిత కాల్స్ (లోకల్ + STD + రోమింగ్), 75 GB వరకు నెలవారీ డేటా, అదనంగా 200 GB వరకు రోల్‌ఓవర్ డేటా, రోజు 100 SMS లను అందిస్తుంది. అలాగే, వినియోగదారులకు 1 సంవత్సరం పాటు Disney+ Hotstar మొబైల్ ప్లాన్‌తో పాటు 6 నెలల పాటు Amazon Prime ఉచిత సభ్యత్వం కూడా లభిస్తుంది. ఈ ప్లాన్‌కు ఫ్యామిలీ మెంబర్స్‌ను యాడ్ చేయాలంటే ఒక్కో వ్యక్తికి రూ. 299 చెల్లించాల్సి ఉంటుంది.
రూ. 599 ప్లాన్
ఈ ప్లాన్‌లో అపరిమిత కాల్స్(లోకల్ + STD + రోమింగ్), 105GB నెలవారీ డేటా(ప్రాథమిక కనెక్షన్‌కు 75 GB డేటా+ప్రతి యాడ్‌ఆన్‌కు 30GB డేటా), రోజు 100 SMSలు లభిస్తాయి. ఇంకా, ఒక ఏడాది పాటు Disney+ Hotstar మొబైల్ ప్లాన్‌తో పాటు 6 నెలల పాటు Amazon Primeకు ఉచిత సభ్యత్వం పొందుతారు. దీంట్లో గరిష్టంగా 9 యాడ్-ఆన్ కనెక్షన్‌లను యాడ్ చేయవచ్చు.
రూ. 999 ప్లాన్
ఎక్కువ మొత్తంలో డేటా కావాలనుకునే వారికి ఇది చాలా మంచి ప్లాన్. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజు 100 SMSలు, 190GB నెలవారీ డేటా, 200 GB వరకు రోల్‌ఓవర్ డేటా లభిస్తాయి. అదనంగా, ఒక సంవత్సరం పాటు Disney+ Hotstar మొబైల్ ప్లాన్‌తో పాటు 6 నెలల పాటు Amazon Primeకు ఉచిత సభ్యత్వం. గరిష్టంగా 9 యాడ్-ఆన్ కనెక్షన్‌లను యాడ్ చేయవచ్చు.
Also Read..