- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
5000 మందిని నియమించుకోనున్నట్టు ప్రకటించిన ఎయిర్ ఇండియా!
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా భారీ నియామకాలను చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఎయిర్ ఇండియా విస్తరణ ప్రణాళికలకు అనుగుణంగా ఈ ఏడాది లోపు 5,000 మంది క్యాబిన్ క్రూ ట్రైనీలు, పైలట్‌లను నియమించుకోవాలని భావిస్తున్నట్టు శుక్రవారం వెల్లడించింది. అందులో 4,200 మంది క్యాబిన్ క్రూ, 900 మంది పైలట్లను తీసుకుంటామని తెలిపింది.
ఈ నెలలో చేసిన గణనీయమైన విమానాల ఆర్డర్ ద్వారా దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో మరిన్ని విమానాలు అందుబాటులోకి రానున్నాయి. అందుకోసం క్యాబిన్ క్రూ, పైలట్లు, నిర్వహణ ఇంజనీర్ల అవసరం ఉంటుందని ఎయిర్ఇండియా ఇన్‌ఫ్లైట్ సర్వీసెస్ హెడ్ సందీప్ వర్మ అన్నారు.
ఈ నెల మొదట్లో ఎయిర్ఇండియా సంస్థ విమానాల తయారీ కంపెనీలైన బోయింగ్, ఎయిర్‌బస్‌లతో భారీ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియా వృద్ధిలో భాగంగా రెండు కంపెనీల నుంచి మొత్తం 470 విమానాలను ఆర్డర్ చేసింది. ఈ మెగా డీల్‌లో భాగంగా పెద్ద ఎత్తున నియామకాలకు కంపెనీ సిద్ధమైంది.