- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బిజినెస్ క్లాస్ చార్జీలపై డిస్కౌంట్ ప్రకటించిన ఎయిర్ ఇండియా
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రయాణికులకు భారీ శుభవార్త చెప్పింది. ఎంపిక చేసిన ఆసియా రూట్లలో బిజినెస్ క్లాస్ చార్జీలపై రాయితీ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక చార్జీలు సాధారణ బేస్ చార్జీల కంటే 35 శాతం వరకు తక్కువగా ఉన్నాయి. బ్యాంకాక్, సింగపూర్, ఫుకెట్, ఢాకా, కొలంబో, దుబాయ్, అబుదాబి, దోహా, జెడ్డా, బహ్రెయిన్, మస్కట్, కువైట్లకు కనెక్ట్ అయ్యే రూట్లకు ఈ తగ్గింపు ధరలు వర్తిస్తాయని ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించిన బుకింగ్‌లు ఏప్రిల్ 2 వరకు, రెండు వారాలు అందుబాటులో ఉంటాయి. ఈ టికెట్లతో బుక్ చేసుకున్న ప్రయాణాలు సెప్టెంబర్ 30 వరకు చెల్లుబాటు అవుతాయి.
వన్ వే రూట్‌తో పాటు టూ వేవ్ రూట్‌కు రాయితీ వర్తిస్తుంది. వీటిని భారత్‌తో పాటు అంతర్జాతీయంగా విక్రయ కేంద్రాల నుంచి కొనుగోలు చేయవచ్చు. ఎయిర్ ఇండియా వెబ్సైట్, మొబైల్ యాప్, ఎయిర్పోర్ట్ టికెటింగ్ ఆఫీసులు, సిటీ బుకింగ్ ఆఫీస్‌లలో టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్ క్రింద పరిమిత సంఖ్యలో సీట్లు ఉంటాయి, కాబట్టి ముందుగా బుక్ చేసుకున్న వారికి ప్రాధాన్యత ఉంటుందని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు.