విమానాల కొనుగోలుతో ఎయిర్ ఇండియాకు 6,500 పైలట్ల అవసరం!

by Harish |   ( Updated:2023-02-17 15:50:37.0  )
విమానాల కొనుగోలుతో ఎయిర్ ఇండియాకు 6,500 పైలట్ల అవసరం!
X

న్యూఢిల్లీ: దేశీయ విమానయాన రంగంలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కరోనా వల్ల కుదేలైన పరిశ్రమలో కార్యకలాపాలు, ప్రయాణీకుల రద్దీ దాదాపు సాధారణ స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన ఎయిర్ ఇండియాను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు టాటా గ్రూప్ భారీ సంఖ్యలో విమానాల కోసం ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.

చరిత్రలోనే ఇప్పటివరకు అతిపెద్ద విమానాల కొనుగోలు ఆర్డర్‌గా నిలిచిన ఎయిర్ఇండియా ఒప్పందంతో భారీగా పైలట్ల నియామకాలు ఉండనున్నాయి. గ్లోబల్ విమానాల తయారీ సంస్థలైన ఎయిర్‌బస్, బోయింగ్‌ల నుంచి 470 విమానాలను నడిపేందుకు ఎయిర్ ఇండియాకు 6,500 మంది పైలట్ల అవసరం ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతానికి ఎయిర్ ఇండియా 113 విమానాలను 1,600 మంది పైలట్లతో నడిపిస్తోంది. వీరు కాకుండా అనుబంధ సంస్థలైన ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ఏషియా ఇండియా, విస్తారాలో కలిపి మరో 1,450 మంది పైలెట్లు ఉన్నారు.

కొన్నిసార్లు సిబ్బంది కొరత వల్ల విమాన ప్రయాణాలను రద్దు చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఎయిర్‌బస్ నుంచి కొనే కొత్త విమానాల నిర్వహణకు ఎయిర్ ఇండియా నాన్-స్టాప్ సర్వీసుల కోసం 1,200 మంది, బోయింగ్ 777 విమానాల కోసం 260 మంది అవసరమవుతారు. అలాగే వైడ్-బాడీ విమానాల కోసం 4,800 మంది వరకు పైలట్ల అవసరం ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

Also Read...

Kotak Mahindra Bank : ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన బ్యాంక్!

Advertisement

Next Story

Most Viewed