పెరిగిన వ్యవసాయ ఎగుమతులు.. ఎంతంటే..!

by Disha News Desk |
పెరిగిన వ్యవసాయ ఎగుమతులు.. ఎంతంటే..!
X

దిశ, వెబ్‌డెస్క్: గతేడాది ఏప్రిల్-నవంబర్ మధ్య కాలంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 23.21 శాతం పెరిగి 31.05 బిలియన్ డాలర్ల(రూ. 2.31 లక్షల కోట్ల)కు చేరుకున్నాయి. ఇదే స్థాయిలో వృద్ధి కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే లోగా(2022,మార్చి 31 నాటికి) మొదటిసారి ఈ ఎగుమతులు 50 బిలియన్ డాలర్ల(రూ. 3.72 లక్షల కోట్ల)ను అధిగమిస్తాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. కొవిడ్-19 మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ వివిధ అక్రిడిటేషన్ గడువు ముగియడానికి ముందే పొడిగింపు నిర్ణయం తీసుకోవడం, ఎగుమతుల్లో సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు, ఎగుమతులకు ఆన్‌లైన్ సర్టిఫికేట్ జారీ, టెస్టింగ్ లేబరోటరీస్ ప్రారంభించడం వంటి చర్యల కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా పెరిగాయని మంత్రిత్వ శాఖ వివరించింది.

అంతేకాకుండా వ్యవసాయ ఎగుమతులు ఉప్పందుకోవడంతో ప్రపంచ డిమాండ్‌ను భారత్ తీర్చగలిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. బాస్మతి యేతర బియ్యం, గోధుమలు, చక్కెర, ఇతర తృణధాన్యాల ఎగుమతులు మెరుగైన వృద్ధిని నమోదు చేశాయి. వీటి ఎగుమతులు పెరగడం మూలంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, హర్యానా, పశ్చిమబెంగాల్, చత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రా, బీహార్ రాష్ట్రాల రైతులకు ప్రయోజనాలు దక్కాయి. కరోనా వల్ల సరఫరా సమస్యలు ఉన్నప్పటికీ కాఫీ ఎగుమతులు 35 శాతం పెరిగాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed