Wedding Season: పండుగ సీజన్ ముగియడంతో పెళ్లిళ్ల సీజన్‌పై వ్యాపారుల దృష్టి

by S Gopi |   ( Updated:2024-11-03 13:09:48.0  )
Wedding Season: పండుగ సీజన్ ముగియడంతో పెళ్లిళ్ల సీజన్‌పై వ్యాపారుల దృష్టి
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా పండుగ సీజన్ ముగిసింది. బంగారం మొదలుకొని ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల వరకు కోట్లాది రూపాయల వ్యాపారం జరిగింద వ్యాపారులు తెలిపాయి. ఈ నేపథ్యంలో దసరా, దీపావళి వంటి పండుగ సీజన్ తర్వాత ముఖ్యమైన పెళ్లిళ్ల సీజన్‌పై వ్యాపారులు దృష్టి సారించారు. ప్రతి ఏటా పెళ్లిళ్ల సీజన్ నవంబర్ రెండో వారంలో ధనత్రయోదశికి మొదలై డిసెంబర్ మూడోవారం వరకు ఉంటుంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) తాజా అధ్యయనం ప్రకారం.. రిటైల్ రంగం, వస్తువులు, సేవలు కలుపుకుని, ఈసారి దాదాపు 48 లక్షల వివాహాలు జరగనున్నాయి. వీటి వ్యాపారం సుమారు రూ. 6 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతేడాది ఈ సీజన్‌లో 35 లక్షల వివాహాలు జరగ్గా రూ.4.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. ఈ సంవత్సరం శుభప్రదమైన వివాహ తేదీలు ఎక్కువగా ఉండటంతో వ్యాపారం కూడా ఎక్కువగా ఉండనుందని వ్యాపారులు భావిస్తున్నారు. 2023లో 11 ముఖ్యమైన శుభలగ్నాలు ఉండగా, ఈ సంవత్సరం 18 ఉన్నాయి. ఇవి వ్యాపారానికి మరింత ఆజ్యం పోశాయని సీఏఐటీ పేర్కొంది. ఒక్క ఢిల్లీలోనే 4.5 లక్షల పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. దీని తర్వాత కూడా కొత్త ఏడాదిలో జనవరి-మార్చి మధ్య ఎక్కువ పెళ్లిళ్లు జరుగుతాయి.

Advertisement

Next Story

Most Viewed