- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Adani Power- Bangladesh: బకాయిలు చెల్లించకుంటే విద్యుత్ సరఫరా నిలిపివేస్తాం.. బంగ్లాదేశ్‌కు అదానీ పవర్ వార్నింగ్..!
దిశ, వెబ్‌డెస్క్: అదానీ గ్రూప్(Adani Group)లోని ప్రముఖ కంపెనీల్లో ఒకటైన అదానీ పవర్(Adani Power) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల ఏడో తేదీ లోగా విద్యుత్ బకాయిలు చెల్లించకపోతే బంగ్లాదేశ్(BAN)కు పవర్ సప్లై నిలిపివేస్తామని హెచ్చరించినట్లు ఒక ప్రముఖ వార్తా మీడియా నివేదించింది. ఈ మేరకు బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వానికి అదానీ పవర్ అల్టిమేటం జారీ చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ గవర్నమెంట్ అదానీ పవర్ సంస్థకు 850 మిలియన్ల డాలర్ల విద్యుత్ బకాయిలు(Electricity Dues) చెల్లించాల్సి ఉంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 7,200 కోట్లు అన్నమాట. కాగా ఇటీవలే తమకు రావాల్సిన బిల్లులు ఆ దేశ్ ప్రభుత్వం చెల్లించని కారణంగా అదానీ పవర్ బంగ్లాదేశ్‌కు విద్యుత్ సరఫరాను సగానికి పైగా తగ్గించింది. దీంతో ఆ దేశంలో 1600 మెగావాట్ల విద్యుత్ కొరత ఏర్పడింది. అయినప్పటికీ బిల్లులు క్లియర్ చేయకపోవడంతో ఈ నెల 7 నుంచి పూర్తిగా విద్యుత్ సరఫరా ఆపేస్తామని అదానీ పవర్ వెల్లడించింది. బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభం(Political Crisis) వల్ల ఏర్పడ్డ ఆర్థిక సమస్యలు, అలాగే డాలర్ల కొరత(Dollars Shortage) కారణంగా ప్రభుత్వం పవర్ బిల్లులు చెల్లించకపోవడానికి కారణమని ఆ దేశ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.