- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రూ.1.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న అదానీ గ్రూప్
దిశ, బిజినెస్ బ్యూరో: అదానీ గ్రూప్ ఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో తన పోర్ట్‌ఫోలియో కంపెనీలలో రూ.1.2 లక్షల కోట్ల(14 బిలియన్ డాలర్ల) పెట్టుబడులు పెట్టాలని చూస్తుంది. రానున్న 7-10 సంవత్సరాల్లో వ్యాపారాలను వృద్ధి చేసేందుకు రూ.8 లక్షల కోట్ల($100 బిలియన్ల) పెట్టుబడికి ప్రణాళికలు కలిగి ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అదానీ గ్రూప్ మార్చి 31న ముగిసే 2024 ఆర్థిక సంవత్సరంలో తన కంపెనీలలో దాదాపు రూ.82 వేల కోట్లు($ 10 బిలియన్ల) మూలధనాన్ని వెచ్చించిందని అంచనా.
రూ.8 లక్షల కోట్ల పెట్టుబడిలో ఎక్కువ భాగం పునరుత్పాదక, గ్రీన్ హైడ్రోజన్, విమానాశ్రయాలు వంటి అభివృద్ధి చెందుతున్న వ్యాపారాల్లోకి వెళ్లనున్నాయి. ప్రధానంగా పునరుత్పాదక శక్తి, గ్రీన్ హైడ్రోజన్ వంటి గ్రీన్ పోర్ట్‌ఫోలియోలోకి 70 శాతం, మిగిలిన 30 శాతం విమానాశ్రయాలు, ఓడరేవుల వ్యాపారాలకే వెచ్చించనున్నారు. 2023లో అదానీ గ్రూప్ పోర్ట్‌ఫోలియో రూ.78 వేల కోట్లకు పెరిగింది. ఒక్క డిసెంబర్ త్రైమాసికంలో గ్రూప్ పోర్ట్‌ఫోలియో రికార్డు స్థాయిలో 63.6 శాతం EBITDA వృద్ధిని నమోదు చేసింది.
నవీ ముంబై ఎయిర్‌పోర్ట్, గంగా ఎక్స్‌ప్రెస్‌వే, గుజరాత్‌లోని ఖవ్డాలో ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక పార్క్, ముంద్రా పోర్ట్ వంటి ప్రాజెక్టులతో అదానీ గ్రూప్ ఇండియాలో $100 బిలియన్ల పెట్టుబడికి కట్టుబడి ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అదానీ గ్రూప్ గుజరాత్‌లో నిర్మిస్తున్న గ్రీన్ ప్రాజెక్ట్ విస్తీర్ణం పారిస్ నగరం కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది.