2028 నాటికి మరిన్ని వ్యాపారాలను ప్రారంభించనున్న Adani Group

by Harish |   ( Updated:2023-01-21 11:22:09.0  )
2028 నాటికి మరిన్ని వ్యాపారాలను ప్రారంభించనున్న Adani Group
X

ముంబై: గౌతమ్ అదానీ ఆధ్వర్యంలోని అదానీ గ్రూప్ 2028 నాటికి కొత్తగా మరిన్ని వ్యాపారాలను ప్రారంభించాలని చూస్తోంది. అలాగే, ఇప్పటికే ఉన్న మైనింగ్, డేటా సెంటర్, విమానాశ్రయాలు, రోడ్లు, మెటల్స్, లాజిస్టిక్స్ వ్యాపారాలను విడదీయాలని యోచిస్తోందని గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జుగేషీందర్ సింగ్ తెలిపారు. ఈ వ్యాపారాలను 2025-28 నాటికి మరింత లాభాలకు తీసుకువెళ్లాలని చూస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టు వ్యాపారంపై పెద్ద ఎత్తున దృష్టి ఉందని, రాబోయే సంవత్సరాల్లో ప్రభుత్వ సేవలకు వెలుపల దేశంలోనే అతిపెద్ద సేవల సంస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

గత ఏడేళ్లలో అదానీ గ్రూప్ తన పవర్, బొగ్గు, ట్రాన్స్‌మిషన్, గ్రీన్ ఎనర్జీ వ్యాపారాన్ని విడదీసింది. ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచంలోని ధనవంతులలో మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా గౌతమ్ అదానీ నిలిచారు. తన సామ్రాజ్యాన్ని ఓడరేవుల నుండి ఇంధనం వరకు విస్తరించాడు. ఇటీవల కొత్తగా మీడియా కంపెనీని కూడా సొంతం చేసుకున్నాడు.

కంపెనీ రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యాన్ని పెంచాలని కోరుకుంటోంది. నిధుల సమీకరణ ద్వారా వచ్చిన నిధులను గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు, విమానాశ్రయ సౌకర్యాలు, గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలకు ఉపయోగించాలని యోచిస్తోంది. అలాగే, తన రుణాన్ని కూడా తగ్గించాలని చూస్తుంది.

Advertisement

Next Story

Most Viewed