- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎలాంటి ఆడిట్ ప్రక్రియ నిర్వహించడం లేదని స్పష్టం చేసిన అదానీ గ్రూప్!
ముంబై: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల తర్వాత భారీ నష్టాలను చూసిన అదానీ గ్రూప్ స్వతంత్రంగా ఆడిట్ ప్రక్రియ నిర్వహించనున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. అందుకోసం ప్రముఖ అకౌంటింగ్ కంపెనీ గ్రాంట్ థార్టన్‌ను నియమించినట్టు పలు నివేదిక పేర్కొన్నాయి. అయితే, అదంతా అవాస్తవమని, తాము ఎలాంటి ఆడిట్ సంస్థను నియమించలేదని అదానీ గురువారం ప్రకటనలో వెల్లడించింది. మార్కెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న రూమర్‌గా దాన్ని చూడాలని కంపెనీ తెలిపింది.
దీనిపై అదానీ గ్రూప్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించగా, సెబీకి కంపెనీ పూర్తి వివరాలను తెలియజేస్తామని స్పష్టం చేసింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలు తిప్పికొట్టేందుకు, పెట్టుబడిదారుల్లో విశ్వాసం నింపేందుకు అదానీ గ్రూప్ స్వతంత్రంగా ఆడిటింగ్ నిర్వహించేందుకు సిద్ధమైందని మార్కెట్ వర్గాల్లో వినిపించింది. కంపెనీ అవసరమైన అన్ని నిబంధనలను పాటిస్తోందని, ఆర్‌బీఐతో పాటు ఇతర నియంత్రణ సంస్థల వద్ద సంస్థ గురించి నిరూపించుకునేందుకు ఆడిట్ నిర్వహిస్తున్నట్లు వార్తలొచ్చాయి. కానీ, అదానీ గ్రూప్ వాటన్నింటిని ఖండిస్తున్నట్టు వెల్లడించింది.