Acer's Republic Day Sale: ల్యాప్‌టాప్‌లు, మానిటర్‌లపై భారీ తగ్గింపులు.. విద్యార్థులకు ప్రత్యేక డిస్కౌంట్స్

by Harish |   ( Updated:2024-01-19 11:53:54.0  )
Acers Republic Day Sale: ల్యాప్‌టాప్‌లు, మానిటర్‌లపై భారీ తగ్గింపులు.. విద్యార్థులకు ప్రత్యేక డిస్కౌంట్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: రిపబ్లిక్ డే సందర్భంగా ఇప్పటికే చాలా ఈ కామర్స్ కంపెనీలు, ఇతర సంస్థలు తక్కువ ధరల్లో ఉత్పత్తులను అందించడానికి ప్రత్యేక సేల్‌ను తీసుకురాగా, ఇప్పుడు అదే బాటలో ప్రముఖ PC తయారీ కంపెనీ Acer, ఇండియాలో కొత్తగా రిపబ్లిక్ డే సేల్‌ను తీసుకొచ్చింది. ఇది ఈ రోజు జనవరి 19 న ప్రారంభమైంది, జనవరి 26 వరకు కొనసాగుతుంది. దీనిలో భాగంగా ఎంపిక చేసిన ల్యాప్‌టాప్‌లు, మానిటర్‌లను భారీ తగ్గింపు ధరలతో కొనుగోలు చేయవచ్చు.

ముఖ్యంగా Acer Predator Helios, Nitro సిరీస్, Aspire 5 గేమింగ్ ల్యాప్‌టాప్‌లు, Acer TravelMate సిరీస్‌లను తక్కువ ధరల్లో సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్‌లో కంపెనీ తన ఏసర్ మానిటర్లను 60 శాతం వరకు తగ్గింపుతో అమ్మకానికి ఉంచింది. అదనంగా రూ.2000 తగ్గింపు కూడా ఉంటుంది. అలాగే, Aspire, Extensa సిరీస్ ల్యాప్‌టాప్‌లపై మూడు సంవత్సరాల ఉచిత వారంటీ ఉంది. Aspire 7 గేమింగ్ ల్యాప్‌టాప్ మోడల్‌లపై రెండు సంవత్సరాల పాటు ఉచిత వారంటీ లభిస్తుంది.

రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేసేటప్పుడు ఎంపిక చేసిన ల్యాప్‌టాప్‌లపై విద్యార్థులు ఏడు శాతం స్టూడెంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. వివిధ బ్యాంక్ కార్డులపై క్యాష్‌‌బ్యాక్‌లు, డిస్కౌంట్లు, నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. ఈ సేల్ ప్రస్తుతం Acer అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.

Advertisement

Next Story