అక్షయతృతీయ బంపర్ ఆఫర్.. రూపాయికే బంగారం!

by samatah |
అక్షయతృతీయ బంపర్ ఆఫర్.. రూపాయికే బంగారం!
X

దిశ, వెబ్‌డెస్క్ : బంగారం అంటే చాలా మందికి ఇష్టం కానీ, ధరను చూసి అందరూ షాక్ అవుతుంటారు. ఇక ఇప్పుడు రోజు రోజుకు బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి తీపికబురు అందించింది.

అయితే ఇప్పుడు అక్షయతృతీయ రాబోతుంది.ఇక ఈ రోజు బంగారం కొనుగోలు చేయాలని చాలా మంది అనుకుంటారు. అలాంటి వారికి బంపర్ ఆఫర్, ఒక్కరూపాయితో కూడా మనం బంగారం కొనుగోలు చేయోచ్చు. అయితే అది డిజిటల్ రూపంలో కొనుగోలు చేయాల్సి వస్తుంది.

మార్కెట్లో ప్రస్తుతం ఉన్న అనేక పేమెంట్ యాప్స్ ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి మనీ వాలెట్ సంస్థలు కేవలం ఒక రూపాయికే డిజిటల్ గోల్డ్‌ను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాయి. 99.99 శాతం స్వచ్ఛతతో 24 క్యారెట్ల గోల్డ్‌నే ఈ కంపెనీలు ఆఫర్ చేస్తాయి.

రూపాయి నుంచి ఎంత మొత్తంలోనైనా ఈ గోల్డ్‌పై ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆ రోజు ఉన్న రేటును బ‌ట్టీ ఒక్క రూపాయికి సరిపడా మైక్రో గ్రాములో బంగారం మీకు లభిస్తుంది. మీరు కొనుగోలు చేసిన బంగారం మీ డిజిటల్ వాలెట్లో నిక్షిప్తం అవుతుంది. ఈ డిజిట‌ల్ గోల్డ్ ను మీరు ఫిజికల్ రూపంలో డెలివరీ పొందే వీలుంది. మరి ఇంకెందుకు ఆలస్యం అక్షయతృతీయ రోజు తప్పనిసరిగా గోల్డ్ కోనుగోలు చేయండి. మీ కోరికను నెరవేర్చుకోండి.

Advertisement

Next Story