- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SEBI: కన్సల్టెన్సీ సంస్థ నుంచి ఆదాయాన్ని ఆర్జించిన సెబీ చీఫ్..!
దిశ, బిజినెస్ బ్యూరో: భారతదేశ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) అధిపతి మాధవి పురి బుచ్, తన ఏడేళ్ల పదవీకాలంలో ఒక కన్సల్టెన్సీ సంస్థ నుండి ఆదాయాన్ని పొందారని తాజాగా రాయిటర్స్ వెల్లడించింది. ఇది రెగ్యులేటరీ నియమాలను ఉల్లంఘించినట్లవుతుందని తెలుస్తుంది. పబ్లిక్ డాక్యుమెంట్లను సమీక్షించిన తర్వాత రాయిటర్స్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. ఇప్పటికే హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆమెపై చేసిన ఆరోపణలు సంచలనం కాగా ఇప్పుడు నిబంధనలకు విరుద్దంగా ఆదాయాన్ని పొందారని రాయిటర్స్ పేర్కొనడంతో మరో సంచలనానికి తెర లేపినట్లయింది. అంతకుముందు అదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకలతో ముడిపడి ఉన్న ఆఫ్‌షోర్ కంపెనీల్లో మాధవి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. బెర్ముడా, మారిషస్‌లలోని అదానీ డొల్ల కంపెనీల్లో వారిద్దరూ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారని పేర్కొంది. ఆ తరువాత హిండెన్‌బర్గ్ తమపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని సెబీ చీఫ్ కొట్టిపారేశారు. వారితో తమకు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సెబీ చీఫ్ గురించి మరో వార్త రావడం గమనార్హం.