- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త టారిఫ్ ప్లాన్‌లు లేకుండా 5జీకి అప్‌గ్రేడ్ చేసే పనిలో టెలికాం కంపెనీలు!
న్యూఢిల్లీ: దేశీయ టెలికాం కంపెనీలు మరో నెల రోజుల్లో 5జీ సేవలు ప్రారంభించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలుత మెట్రో నగరాల్లో తీసుకురానున్న 5జీ సేవలకు సంబంధించి టారిఫ్ ధరలను పెంచే అంశంపై ఆచీతూచీ వ్యవహరించాలని టెలికాం దిగ్గజాలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు భావిస్తున్నాయి. జాతీయ పత్రిక ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం, ఇప్పుడున్న 5జీ స్మార్ట్‌ఫోన్‌లలో సాంకేతిక సమస్యల కారణంగా వినియోగదారులకు 4జీ ధరల స్థాయిలోనే 5జీ సేవలందించాలని కంపెనీలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం మార్కెట్లో 5జీ హ్యాండ్‌సెట్లు తక్కువగా ఉండటం, దీనికి తోడు నిర్దిష్ట స్పెక్ట్రమ్ బ్యాండ్‌ను ఇప్పుడున్న 5జీ స్మార్ట్‌ఫోన్‌లు పూర్తిస్థాయిలో సపోర్ట్ చేయకపోవడం వంటి టెక్నాలజీ పరిమితులు ఉన్నాయి. కాబట్టి ఈ సాంకేతిక పరమైన సవాళ్లను అధిగమించేందుకు వినియోగదారులకు కొత్త 5జీ ప్యాక్‌లను ప్రవేశపెట్టడానికి బదులుగా ఇప్పుడున్న 4జీ టారిఫ్ ప్లాన్‌ల నుంచి 5జీకి అప్‌గ్రేడ్ చేయాలని కంపెనీలు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయి.
దీనివల్ల సబ్‌స్క్రైబర్లు సిమ్ కార్డులను మార్చుకునే అవసరం ఉండదు. తద్వారా సాంకేతిక సవాళ్ల మధ్య 5జీ సేవలను ప్రారంభించడం సులభమవుతుందని కంపెనీల అంచనా. అంతేకాకుండా టారిఫ్ ధరలను పెంచకుండా ఉంటే 5జీ వినియోగదారుల్లో డేటా వినియోగం పెరిగే అవకాశం ఉంది. ఇది కంపెనీల వినియోగదారు సగటు ఆదాయం(ఆర్పు) పెరుగుదలకు దోహదపడుతుంది.
ప్రస్తుతం దేశంలో మొత్తం 60 కోట్ల యాక్టివ్ స్మార్ట్‌ఫోన్‌లలో 5 కోట్లు మాత్రమే 5జీ సంబంధిత ఫోన్లు ఉన్నాయి. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ ఇటీవలి నివేదిక ప్రకారం, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో మొత్తం స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో 5జీ హ్యాండ్‌సెట్ల వాటా 35 శాతం ఉంటుందని, దీంతో మొత్తం 5జీ ఫోన్‌ల సంఖ్య దాదాపు 8.5 కోట్లకు చేరుకోనుందని పేర్కొంది.
Also Read: కంపెనీ సీఈవోగా AI పవర్డ్ హ్యూమనాయిడ్ రోబో..