- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2023 కొత్త ఏడాదిలో బ్యాంకు సెలవులు ఇవే..
దిశ, వెబ్‌డెస్క్: కొత్త ఏడాది రాబోతున్న తరుణంలో వివిధ పనుల కోసం బ్యాంకులకు వెళ్లె వారు ఏ తేదీన బ్యాంకులకు సెలవులు ఉంటాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీని వలన సమయం ఆదా అవడమే గాక, ఆ రోజు చేయాల్సిన పనులను పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు. ప్రతి ఏడాది ముందుగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) బ్యాంకు సెలవుల లిస్ట్‌ను విడుదల చేస్తుంది. అలాగే, రాబోయే 2023 కు సంబంధించిన తెలుగు రాష్ట్రాల బ్యాంకుల సెలవుల వివరాలను RBI ఇటీవల విడుదల చేసింది. ఇప్పుడు ఏ ఏ తేదీలలో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో.. ఒకసారి చూద్దాం..
2023 తెలుగు రాష్ట్రాల సెలవుల లిస్ట్
* జనవరి 15 (ఆదివారం)- సంక్రాంతి
* జనవరి 26 (గురువారం)- రిపబ్లిక్ డే
* ఫిబ్రవరి 18 (శనివారం)- మహాశివరాత్రి
* మార్చి 7 (మంగళవారం)- హోళీ
* మార్చి 22 (బుధవారం)- ఉగాది
* మార్చి 30 (గురువారం)- శ్రీరామనవమి
* ఏప్రిల్ 1 (శనివారం)- బ్యాంక్స్ ఇయర్లీ అకౌంట్స్ క్లోజింగ్ డే
* ఏప్రిల్ 5 (బుధవారం)- బాబూ జగ్జీవన్ రామ్ జయంతి
* ఏప్రిల్ 7 (శుక్రవారం)- గుడ్ ఫ్రైడే
* ఏప్రిల్ 14 (శుక్రవారం)- అంబేద్కర్ జయంతి
* ఏప్రిల్ 22 (శనివారం)- రంజాన్
* మే 1 (సోమవారం)- మే డే
* జూన్ 29 (గురువారం)- బక్రీద్
* జూలై 29 (శనివారం)- మొహర్రం
* ఆగస్టు 15 (మంగళవారం)- ఇండిపెండెన్స్ డే
* సెప్టెంబర్ 7 (గురువారం)- శ్రీకృష్ణ జన్మాష్టమి
* సెప్టెంబర్ 18 (సోమవారం)- వినాయక చవితి
* సెప్టెంబర్ 28 (గురువారం)- మిలాద్ ఉన్ నబి
* అక్టోబర్ 2 (సోమవారం)- గాంధీ జయంతి
* అక్టోబర్ 24 (మంగళవారం)- దసరా
* నవంబర్ 12 (ఆదివారం)- దీపావళి
* నవంబర్ 27 (సోమవారం)- కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి
* డిసెంబర్ 25 (సోమవారం)- క్రిస్మస్
ఇవే కాకుండా బ్యాంకులకు సాధారణ సెలవులు కూడా ఉంటాయి. ప్రతి నెలలో రెండో శనివారం, నాలుగో శనివారం, ప్రతి ఆదివారం బ్యాంకులకు సెలవు.