- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్ చెప్పిన LIC
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ దిగ్గజ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలను 17 శాతం పెంచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఈ పెంపు 2022 ఆగస్టు నుండి అమల్లోకి వస్తుంది. దాదాపు ఒక లక్ష మందికి పైగా ఉద్యోగులు ఈ ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంది. అలాగే, ఉద్యోగ విరమణ పొందిన 30,000 మంది పెన్షనర్లకు కూడా ప్రయోజనం చేకూరుతుంది. మొత్తం అలవెన్స్‌లతో సహా, వేతన పెంపు 22 శాతం వరకు ఉంటుందని ప్రముఖ మీడియా నివేదించింది.
ఈ పెంపు కారణంగా LIC పై అదనంగా రూ.4,000 కోట్లకు వరకు భారం పడే అవకాశం ఉంది. గతంలో ఉద్యోగుల జీతాలను 14 శాతం పెంపును సంస్థ ప్రతిపాదించగా, దానిని ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయి. తాజాగా 16 శాతం పెంపుదలకు ఆమోదం లభించింది. గత నెల, డిసెంబర్ 2023తో ముగిసిన మూడో త్రైమాసికంలో LIC నికర లాభం 49 శాతం పెరిగి రూ.9,444 కోట్లకు చేరుకుంది. అతిపెద్ద బీమా సంస్థ గత ఏడాది కాలంలో రూ.6,334 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.