- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫిబ్రవరి నెలలో వాహన విక్రయాల్లో 13 శాతం వృద్ధి: ఫాడా
దిశ, బిజినెస్ బ్యూరో: ఫిబ్రవరి నెలలో వాహన విక్రయాలు 13 శాతం పెరిగినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్(ఫాడా) గురువారం తెలిపింది. అన్ని విభాగాల్లో అమ్మకాలు పుంజుకున్నాయి. మార్కెట్లోకి కొత్త మోడల్స్ విడుదల కావడం, పట్టణ ప్రాంతాలతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొనుగోళ్లు ప్రోత్సాహకరంగా ఉండటంతో ఫిబ్రవరి నెలలో 20,29,541 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఇది క్రితం ఏడాది ఇదే నెలలో 17,94,866 యూనిట్లుగా నమోదైంది.
ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో ప్యాసింజర్ వాహన విక్రయాలు మంచి పనితీరును కనబరిచాయి. గత ఏడాది ఇదే నెలలో 2,93,803 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ప్రస్తుతం 12 శాతం వృద్ధిని సాధించి 3,30,107 యూనిట్లకు చేరుకున్నాయి. ఫిబ్రవరి నెలలో ఈ విభాగంలో అత్యధిక విక్రయాల సంఖ్య ఇదేనని ఫాడా తెలిపింది. ద్విచక్ర వాహనాలకు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్ వచ్చింది. ప్రీమియం మోడళ్లకు డిమాండ్ పెరగడం, ఎంట్రీ-లెవల్ విభాగంలో దృఢమైన పనితీరు, కొత్త ఆఫర్లు, పెళ్లిళ్ల సీజన్, మెరుగైన ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రస్తుతం సమీక్ష నెలలో అమ్మకాలు 13 శాతం పెరిగి 14 లక్షలకు పైగా విక్రయాలు జరిగాయి. ఇది గత ఏడాది ఇదే నెలలో 12 లక్షల యూనిట్లుగా ఉంది.
అలాగే, మూడు చక్రాల వాహనాలు విక్రయాలు 24 శాతం వృద్ధితో 94,918 యూనిట్లకు, ట్రాక్టర్ల విక్రయాలు 11 శాతం పుంజుకుని 76,626 యూనిట్లకు, వాణిజ్య వాహనాలు 5 శాతం వృద్ధితో 88,367 యూనిట్ల విక్రయాలు జరిగాయి. FADA ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా మాట్లాడుతూ, ప్రస్తుతం మార్కెట్లో వాహనాల కొనుగోలుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయి. అన్ని వర్గాల వాహన విక్రయాలు పుంజుకోవడం సంతోషించే విషయం. ఈ వృద్ధిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు.