- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అక్కడ తులం బంగారం ధర రూ. 37 వేలు.. లేటెందుకు మరి త్వరగా వెళ్ళండి!
దిశ, వెబ్‌డెస్క్: భారతీయులకు అత్యంత ఇష్టమన వాటిలో మొదటిస్థానంలో ఉండేదంటే బంగారం మాత్రమే.పెళ్లి నుంచి మొదలుకుని ఏ ఫంక్షన్ అయినా బంగారం ఉండాల్సిందే. ఇంతకుముందు తులం బంగారం ధర రూ.30 వేల లోపు ఉండేది. ఇప్పుడు అది కాస్త క్రమంగా రూ. 56 వేలకు చేరింది. దీంతో కొంత మంది వినియోగదారులు బంగారం కొనే విషయంలో ఆలోచిస్తున్నారు. అయితే ఇంత ధర కలిగిన బంగారం కేవలం రూ. 38 వేల లోపు వస్తే ఎలా ఉంటుంది. అందరూ ఎగబడి మరి కొంటారు. అవును, మీరు విన్నది నిజమే తులం బంగారం ధర రూ.37,588.49 కే కొనుగోలు చేయవచ్చు.
అయితే అది ఇండియాలో మాత్రం కాదు. భూటాన్‌లో మాత్రమే ఈ ధరలో లభిస్తుంది. ఫిబ్రవరి 21న భూటాన్ హిస్ మెజెస్టి ది కింగ్, లోసార్ జన్మదినోత్సవం, నూతన సంవత్సరం సందర్భంగా అక్కడి ప్రభుత్వం ఎలాంటి పన్ను లేకుండా బంగారాన్ని కొనుగోలు చేయడానికి అవకాశం కల్పించింది. భూటాన్‌లోని ఫుయంత్షోలింగ్, థింపు ప్రాంతాల్లో పర్యటించే భారతీయులు ట్యాక్స్ ఫ్రీ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. భూటాన్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడమే దీని ఉద్ద్యేశం.
పన్నులు లేకపోవడం వలన 10 గ్రాముల బంగారం ధర ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.37,588.49 గా ఉంది. ఇదే ధరకు భారతీయులు కొనొచ్చు. అయితే ఇందులో కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. భారతీయులు రూ.1,200 నుంచి రూ.1,800 మధ్య సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఫీజ్ చెల్లించాలి. దీంతో పాటు భూటాన్ ప్రభుత్వం టూరిస్ట్ సర్టిఫైడ్ హోటల్‌లో కనీసం ఒక రాత్రి బస చేయాలి. బంగారాన్ని కొనేందుకు పర్యాటకులు అమెరికా డాలర్ల రూపంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన డ్యూటీ-ఫ్రీ అవుట్‌లెట్ల ద్వారా పన్ను రహిత బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం భారతీయ పురుషుడు రూ. 50,000 విలువైన బంగారాన్ని (సుమారు 20 గ్రాములు), భారతీయ స్త్రీలు రూ. ఒక లక్ష విలువైన బంగారాన్ని (సుమారు 40 గ్రాములు) విదేశాల నుంచి భారతదేశానికి పన్ను లేకుండా తీసుకురావచ్చు.