- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మెరుగైన రుణాల పంపిణీతో రికవరీ సంకేతాలు’
దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ తన వ్యక్తిగత రుణాల పంపిణీ గతేడాదిలో 95 శాతం రికవరీ సాధించినట్టు వెల్లడించింది. కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తి ఉన్నప్పటికీ సెప్టెంబర్ నెలలో మెరుగైన వ్యక్తిగత రుణాల పంపిణీని నిర్వహించామని, సంక్షోభానికి ముందున్న స్థాయికి వ్యాపారం కోలుకుంటోందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పేర్కొంది. వ్యక్తిగత రుణాల విభాగం ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ మధ్య నెలవారీ మెరుగుదలను చూస్తూన్నామని హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
అలాగే, ఈ త్రైమాసికంలో రుణ దరఖాస్తుల సంఖ్య గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 12 శాతం పెరిగాయని, అదేవిధంగా రుణాల ఆమోదం గతేడాదితో పోలిస్తే 9 శాతం పెరిగాయని బ్యాంకు పేర్కొంది. వార్షిక ప్రాతిపదికన సెప్టెంబర్‌లో వాల్యూమ్ పరంగా వ్యక్తిగత రుణ రసీదులు 21 శాతం పెరిగాయని, ఆమోదాలు 31 శాతం అధికంగా ఉన్నట్టు బ్యాంకు తెలిపింది. ఈ పెరుగుదలలు కొవిడ్-19కి ముందునాటి స్థాయిలను సూచిస్తున్నాయని పేర్కొంది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు మొత్తం రూ. 3,026 కోట్ల రుణాలను కేటాయించింది. గతేడాది ఇదే కాలంలో కేటాయించిన రుణాల మొత్తం రూ. 7,160 కోట్లు. అలాగే, ఈ త్రైమాసికంలో డివిడెండ్ ద్వారా కంపెనీ స్థూల ఆదాయం రూ. 232 కోట్లని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది.