నిద్రలోకి జారుకున్న డ్రైవర్.. బోల్తా కొట్టిన బస్సు

by Sumithra |   ( Updated:2021-06-05 08:33:52.0  )
నిద్రలోకి జారుకున్న డ్రైవర్.. బోల్తా కొట్టిన బస్సు
X

దిశ, కొత్తగూడెం : డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా కూలీలతో వెళ్తున్న బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం చుంచుపల్లి మండలం విద్యానగర్ గ్రామ పంచాయతీ వద్ద తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో వెలుగు చూసింది. ప్రమాదవ శాత్తు డివైడర్‌ను ఢీకొని బస్సు బోల్తా కొట్టిన ఘటనలో 35 మంది కూలీలు సురక్షితంగా బయటపడ్డారు.

ప్రమాద సమయంలో బస్సు గోవా నుండి జార్ఖండ్ వెళ్తున్నట్లు సమాచారం. డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతోనే బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. కూలీలకు ఏ చిన్న గాయం తగలకుండా బయట పడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Advertisement

Next Story