ఆర్టీసీ డ్రైవర్ కు ఫిట్స్.. పత్తి చేనులోకి దూసుకెళ్లిన బస్సు

by Aamani |   ( Updated:2021-11-02 03:42:06.0  )
Bus-Accident-1
X

దిశ, బెజ్జుర్: ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు ఫిట్స్ రావడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణ సమీపంలో ఉన్న చెక్ పోస్ట్ వద్ద మంగళవారం ఘటన చోటు చేసుకుంది. కాగజ్ నగర్ నుండి ఆసిఫాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు ఫిట్స్ రావడంతో చెక్ పోస్ట్ సమీపంలో ఉన్న పత్తి చేనులోకి బస్సు దూసుకెళ్లింది. ఆ సమయంలో తమ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఉన్నామని, కానీ ఎలాంటి నష్టం జరగలేదని ప్రయాణికులు తెలిపారు.

Advertisement

Next Story